వరుస హిట్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్ళిచూపులు, గీతాగోవిందం, అర్జున్ రెడ్డి లాంటి హిట్లు ఇవ్వటంతో డిస్టిబ్యూటర్లు, బయ్యర్లు కూడా విజయ్ దేవరకొండ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. మరో రెండు రోజుల్లో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 40కోట్ల దాకా అమ్ముడవడం విశేషం. 
 
డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నైజాంలో ఈ సినిమాకు తొమ్మిది కోట్లకు అమ్మారు. సీడెడ్ ఏరియాలో మూడున్నర కోట్లకు, కృష్ణా జిల్లాలో కోటిన్నర, నెల్లూర్ జిల్లాలో ఎనభై లక్షలకు, గుంటూర్ జిల్లా రెండు కోట్లకు, వైజాగ్ ఏరియాకు రెండున్నర కోట్ల రుపాయలకు డియర్ కామ్రేడ్ హక్కులు అమ్మినట్లు తెలుస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలకు మూడు కోట్ల ఇరవై లక్షలకు డియర్ కామ్రేడ్ హక్కులు అమ్మినట్లు సమాచారం. ఓవర్సీస్ 
నాలుగు కోట్ల రుపాయలకు అమ్మగా మిగతా ఇండస్ట్రీల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 
 
డియర్ కామ్రేడ్ సినిమా థియేట్రికల్ హక్కులు అన్నీ కలిపి దాదాపు 40 కోట్ల దాకా అమ్ముడవుతున్నట్లు తెలుస్తుంది. డిజిటల్, శాటిలైట్ హక్కులు అన్నీ కలిపితే 50 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోంది డియర్ కామ్రేడ్ సినిమా. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. భరత్ కమ్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. జులై 26న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డియర్ కామ్రేడ్ సినిమా విడుదల కాబోతుంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: