టాలీవుడ్ సినిమా పరిశ్రమలో 2000వ దశకం నుండి దాదాపుగా పదేళ్లవరకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ చిన్న, పెద్ద అని తేడాలేకుండా దాదాపుగా చాలా సినిమాలకు మ్యూజిక్ ని అందించడం జరిగింది. ఇక మెగాస్టార్ మొదలుకుని గోపీచంద్ వరకు మణిశర్మ అందించిన మ్యూజికల్ హిట్స్ ఎన్నెన్నో ఉన్నాయి. ఇక అక్కడినుండి మెల్లగా యువతరం రాకతో మణిశర్మకు అవకాశాలు తగ్గడం మొదలయ్యాయి. ఇక ఆ సమయంలోనే దేవిశ్రీప్రసాద్ కొత్తగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొదట్లో దేవి సాంగ్స్ యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. 

ఆపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకు దేవికి వకాశం రావడం, ఆ సినిమా మరియు సాంగ్స్ సూపర్ హిట్ కావడం జరిగిపోయాయి. ఇక ఆ సినిమా సాంగ్స్ ఇప్పటికీ అక్కడక్కడా వినపడుతూనే ఉంటాయి. ఇక అక్కడినుండి టాలీవుడ్ లో వరుస అవకాశాలతో మంచి అలరించే సాంగ్స్ తో దూసుకెళ్లిన దేవి, ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. అయితే ఇటీవల సూపర్ స్టార్ మహేష్ కు వన్ నేనొక్కడినే, శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి మూవీస్ కు ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చిన దేవి, మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహర్షితో మాత్రం కొంత నిరాశపరిచారనే చెప్పాలి. వాస్తవానికి ఆ సినిమా సాంగ్స్ సక్సెస్ సాధించినప్పటికీ, అభిమానులు ఆశించిన రేంజిలో లేవు అనే టాక్ మాత్రం విపరీతంగా వినపడింది. 

అయితే అంతకముందు నుండి దేవికి అవకాశాలు కూడా ఒకింత తగ్గుతూ వస్తున్నాయి. ఇక మహర్షి తరువాత ఆయనకు ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలు ఏవి లేవనే చెప్పాలి. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమాలు తప్పించి టాలీవుడ్ లో సినిమాలేవీ ఆయన చేతిలో లేవు. నిజంగా దేవికి ఒకరకంగా ఇది గడ్డు కాలమే అంటున్నారు విశ్లేషకులు. అయితే దానికి కారణం అయన మ్యూజిక్ శ్రోతలకు నచ్చకపోవడం కారణం కాదని, ఇటీవల కొత్త సంగీత దర్శకుల రాక ఎక్కువవడం, అలానే యువ సంగీత దర్శకులు కూడా బాగా రాణిస్తూ మంచి మ్యూజిక్ ఇస్తుండడంతో, దర్శక నిర్మాతలు కూడా వారి వైపు చూస్తున్నట్లు సమాచారం. మళ్ళి దేవికి పూర్వైవైభవం అతి త్వరలో రావాలని ఆశిస్తూ అయన అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: