ఒకప్పుడు తెలుగు,తమిళ, మళియాళ, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన ప్రముఖ నటి ప్రియారామన్ నేడు బీజేపీ లో చేరారు.  గతంలో ఆమె దేశ ద్రోహులు, దొరబాబు, మాఊరి మారాజు లాంటి తెలుగు సినిమాల్లో నటించారు.  ఇటీవల శర్వానంద్ నటించిన పడి పడి లేచే మనసు సినిమాలో కూడా కనిపించారు.  ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రియారామన్ సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆ మద్య జరిగిన ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీ అఖండ విజయం సాధించింది.


ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రెటీలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీ సీనియర్ నేతలు కూడా బీజేపీ కండువా కప్పుకుంటున్నారు.  తాజాగా బీజేపీలో చేరిన ప్రియారామన్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో తన రోల్ మోడల్ నరేంద్ర మోడీ అని చెప్పిన ప్రియారామన్‌.. తనకు పదవులు ముఖ్యం కాదని.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.  


దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలతోనూ ఆమెకు అనుబంధం ఉండటంతో ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ పెద్దలు కూడా ఉత్సాహం కనబరుస్తున్నారు.  ప్రియారామన్‌ చేరికతో సౌత్‌లో పార్టీకి స్టార్‌ వాల్యూ వస్తుందని ఆ బీజేపీ భావిస్తోంది. మరో విశేషమేంటంటే.. స్వరాష్ట్రం కేరళలో కాకుండా ఏపీ కేంద్రంలో ఆమె పార్టీ కార్యకలాపాలు నిర్వర్తిస్తారని తెలిసింది. తెలుగు సినిమాలతో పాటు ఆమె వివిధ భాషల్లో 50 సినిమాలకు పైగా నటించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: