టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ జంటగా పేరు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక. కన్నడ ఇండస్ట్రీ నుండి వెండితెరకు పరిచయమైన హీరోయిన్ రష్మిక..మొట్టమొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొని వెంటనే నిశ్చితార్థం చేసుకొని వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావడంతో...ఆమె పేరు వార్తల్లో మారుమ్రోగిపోయింది. ఇలా వివాదాల నడుమ రష్మిక బాగా పాపులర్ అవ్వగా టాలీవుడ్ ఇండస్ట్రీలో గీతాగోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ తో లిప్ లాక్ ముద్దు పెట్టి మరింత క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకుంది.

Image result for rashmika mandanna

ఇదిలా ఉండగా టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లకు మాత్రమే రష్మిక ఎక్కువ అవకాశాలు ఇవ్వడంతో...కన్నడ ఇండస్ట్రీకి చెందిన చాలామంది  హీరోయిన్ రష్మిక పై మండిపడుతున్నారు. మరోపక్క రష్మిక తన దృష్టిలో అన్ని భాషలో ఒకటే అని కన్నడ సినిమాలకు కూడా ఎక్కువ ఇంపార్టెంట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. మరోపక్క కన్నడ భాష కొంచెం కష్టంగా ఉందని డబ్బింగ్ చెప్పడానికి కూడా కొంచెం కష్టతరంగా ఉన్నట్లు వ్యాఖ్యానించింది.

Image result for rashmika mandanna

దీంతో రష్మిక చేసిన కామెంట్లపై కన్నడ రాష్ట్రానికి చెందిన ప్రజలు మండిపడుతున్నారు. మా భాష అంత కష్టంగా ఉండదని ఎందుకు ఇలాంటి కామెంట్లు రష్మిక చేస్తుందోనని...తెలుగు కన్న కన్నడ భాష పెద్ద కష్టమేమీ కాదు అంటూ రష్మిక పై కన్నడీగులు మండి పడుతున్నారు. మొత్తం మీద కన్నడ భాష పై విజయ్ దేవరకొండ బెస్ట్ ఫ్రెండ్ రష్మిక చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో పెనుదుమారాన్ని రేపుతున్నయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: