గతకాలం మేలు వచ్చు కాలం కంటెన్ అని తెలుగులో ఓ సామెత ఉంది. ఎవరైనా తన వరకూ బాగా ఉందనుకుంటారు. తాను లైమ్  లైట్ లో ఉన్నపుడు అంతా ఒకే. కాస్త పక్కకు జరిగితే మాత్రం అప్పట్లో ఆలా అంటూ పాతాళభైరవి కాలం నాటి కధలు వినిపిస్తారు. ఇపుడు అలా అనలేం కానీ..


కోటి అని మంచి మ్యుజీషియనే ఈ మాటలు అనడంతోనే  అది హాట్ టాపిక్ అవుతోంది. ఆయన ఎవరో కాదు రసాలూరు సంగీత దిగ్గజం సాలూరు రాజేశ్వరరావు గారి అబ్బాయి. తెలుగు సినిమాల్లో 80, 90 దశకంలో తానేంటో ప్రూవ్ చేసుకున్న కోటి ఇపుడు సినిమాలు చేయడంలేదు. అలా అనే కంటే ఆయనకు అవకాశాలు ఇవ్వడంలేదని చెప్పడం సబబు.


ఓ చానల్ ఇంటర్వ్యూలో కోటి మాట్లాడుతూ ఇప్పటి సినిమా పాటల్లో సంగీతం ఏముందని ప్రశ్నించారు. ఎవరో నోటికొచ్చినట్లు రాయడం మరొకరు పాడడం, ఇంకొకరు కంపోజ్ చేయడం ఇలా తయారైంది తెలుగు పాట అంటూ వాపోయారు. ఇపుడు మ్యూజిక్ డైరెక్టర్లకు ఎటువంటి గౌరవం లేదని ఆయన క్లారిటీగా చెప్పేశారు.


సంగీతం తెలిసిన వారు కూడా పెద్దగా లేరని, గౌరవించేవారు  అంతకంటే లేరని కూడా ఆయన అంటున్నారు. మా రోజుల్లో అయితే సింగర్స్ కి, లిరిక్ రైటర్లకు కూడా ఎంతో గౌరవం, విలువా ఉండేవని కూడా కోటి చెప్పుకొచ్చారు. ఇది స్పీడ్ యుగం ఇంతే, మరిన్ని మార్పులు కూడా వస్తాయి, భరించడమేనని కోటి అంటున్నారు. మొత్తానికి యంగర్ జనరేషన్ మీద కోటి వేసిన సెటైర్లు వారెలా తీసుకుంటారో.



మరింత సమాచారం తెలుసుకోండి: