ఓడలు బళ్ళు అవుతాయి.. బళ్ళు ఓడలు అవుతాయి అంటే అర్ధం చాలా మందికి తెలియదు.  అందుకే సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తుంటారు.  సినీ పరిశ్రమకు వచ్చి మంచి విజయాలు సాధించిన వ్యక్తులు ఉన్నారు.  విఫలమైన వ్యక్తులు ఉన్నారు.  


ఇదంతా ఎందుకు చెప్పుకోవలసి వచ్చింది అంటే అమలా పాల్ గురించి చెప్పుకోవాల్సి వచ్చింది.  తనకు 17 సంవత్సరాల వయసులో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.  అలా అడుగుపెట్టిన ఈ హీరోయిన్... కెరీర్ స్టార్టింగ్లో మంచి విజయాలు నమోదు చేసుకుంది.  


2014 లో దర్శకుడు విజయ్ ను వివాహం చేసుకుంది.  రెండేళ్ల కాపురం తరువాత ఇద్దరు విడిపోయారు.  2017 లో లీగల్ గా విడిపోయారు.  ఆ సమయంలో జీవితం సూన్యంలా కనిపించిందట.  వెంటనే హిమాలయాలకు వెళ్ళిపోయింది.  అక్కడ రెండు నెలల గడిపిందట.  


గుడారాల్లో ఉంటూ దొరికింది తింటూ ఉన్న సమయంలో జీవితం గురించి చాలా తెలుసుకున్నట్టు ఆమె చెప్పింది.  తిరిగి వచ్చాక పాండిచ్చేరిలో స్థిరపడింది. తనకున్న అవసరాల కోసం బెంజ్ కారును అమ్మేసింది.  నెలకు కేవలం 20వేల రూపాయలు మాత్రమే ఖర్చు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతుందట.  ఇప్పుడు లైఫ్ చాలా బాగుందని అంటోంది అమలా పాల్.  


మరింత సమాచారం తెలుసుకోండి: