బాలీవుడ్ లో తెలుగు సినిమా రీమేక్ హవా రోజు రోజుకూ జోరందుకుంటోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'జెర్సీ' సినిమా తెలుగులో భారీ విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే, అయితే ఈ సినిమా హిందీ లో కూడా రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీనినే బాలీవుడ్ అగ్ర నిర్మాతైనా కరణ్ జోహార్ రీమేక్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో తాజా కబీర్ సింగ్ తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న షాహిద్ ను జెర్సీ రీమేక్ లో నటించేందుకు ఎంపిక చేసుకోవాలని కరణ్ ఆలోచిస్తున్నారట.

దీనికిగాను షాహిద్ భారీ మొత్తంలో పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్టు బాలీవుడ్ సమాచారం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై కోట్లు డిమాండ్ చేయగా షాహిద్ ఇందుకు అర్హుడిగా భావించిన కరణ్ తగినంత పారితోషికాన్ని ఇవ్వడానికి సిద్ధప డినట్లు బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన కబీర్ సింగ్ ఇప్పటికే దాదాపు మూడు వేల కోట్లు వసూలు చేసింది ఇదే కాక ఈ మధ్యే 'డియర్ కామ్రేడ్' రీమేక్ గురించి కూడా కరణ్ ప్రస్తావించగా ఇపుడు జెర్సీ ఓ బేబీ లాంటి సినిమా రీమేక్ ల బాట పట్టారు, ఇవి ఎలాంటి విజయాల్ని తెచ్చిపెడతాయో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: