నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఓ బేబీ'.  జులై 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొరియన్ మూవీ మిస్ గ్రానీ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై మూడు వారాలు కావస్తున్నఇంకా ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ సినిమాలో సమంత నటనకు ప్రేక్షకులతో పాటుగా విమర్శకులు కూడా ప్రశంసలతో ముంచెత్తారు.  మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నప్పటికి ఈ ఎఫెక్ట్ ఓ బేబీ మీద ఏమాత్రం పడలేదు. తాజాగా ఈ సినిమా అమెరికాలో మరో ఘనత సాధించింది. 

అమెరికాలో ఈ సినిమా కలెక్షన్స్ తాజాగా వన్ మిలియన్ డాలర్ మార్క్ ను దాటాయి.  ఈ సందర్భంగా 'ఓ బేబీ' టీమ్ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది.  ఈ పోస్టర్ ను సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పోస్ట్ చేసింది.  ఈ పోస్టర్ లో 1 మిలియన్ డాలర్ సంఖ్యపై సమంత క్వీన్ బీ లాగా కూర్చొని ఉంది.  సైడ్ లో సమంతా సంతోషంగా రెడ్ డ్రెస్ లో స్టెప్పులు వేస్తూ ఉంది.  సమంతకు వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో ఎంటర్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే ఈ సినిమా సమంతకు చాలా ప్రత్యేకం.  

ఈ సినిమా విజయంతో ఓవర్సీస్ లో  సమంత స్టార్ హీరోలతో సమానంగా క్రౌడ్ పుల్లింగ్ స్టార్ అని నిరూపించుకుంది. సమంత హీరోయిన్ గా నటించిన 'మజిలీ' కూడా అమెరికాలో రెడ్ హార్ట్ మూవీస్ విడుదల చేశారు. వన్ మిలియన్ డాలర్ మార్క్ టచ్ చేయడం విశేషం. ఇదిలా వుంటే అక్కినేని ఫ్యామిలిలో హీరోస్ కంటే కూడా సమంత అన్నీ రకాలుగా స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తుందని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: