టాలీవుడ్ ఇండస్ట్రీ హీరో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా శుక్రవారం విడుదల అవటానికి సిద్ధంగా ఉంది. విజయ్ దేవరకొండ తో ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటించడంతో సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాలో స్టూడెంట్ లీడర్ గా నటించడంతో సినిమాపై తెలుగు ప్రేక్షకులకు మరింత ఆసక్తి పెరిగింది.


ఇటువంటి క్రమంలో తాజాగా ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఆ వార్తలో ఉన్నది ఏమిటంటే…. సినిమాలో ఆడవాళ్ళ హక్కుల గురించి మరియు క్యాస్టింగ్ కౌచ్ వంటి విషయాల గురించి అలాగే సమాజంలో మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపుల గురించి సినిమా ఉంటున్నట్లు సినిమాలో ఆడవాళ్ళ హక్కుల గురించి వచ్చే పోరాట సన్నివేశాలు..ప్రేక్షకులను కంటతడి పెట్టించే విధంగా ఉంటున్నట్లు ఇందుకోసం ఒక లీడర్ గా విజయదేవరకొండ నటించే విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని సోషల్ మీడియాలో ఒక వార్త ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ చక్కర్లు కొడుతుంది.


ఇదిలా ఉండగా హిందీలో రీమేక్ చేయాలని ఈ సినిమాని ముందే చూసిన బలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సినిమా అద్భుతంగా ఉందని...అందరికంటే ముందు చూడటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్టు పెట్టడంతో డియర్ కామ్రేడ్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: