అమలాపాల్ కెరీర్ సరిగ్గా చెప్పాలంటే ఏమంత బాలేదనే క్లియర్ గా అర్థమవుతోంది. తెలుగులో ఐతే తన సినిమా వచ్చి చాలా కాలమే అయింది. అందం, అభినయం ఉన్నా కూడా అమలకు తెలుగులో సరైన అవకాశాలు రాలేదు. అయితే తమిళంలో మాత్రం అడపా దడపా చిన్నా చితకా సినిమాలు చేస్తోంది. ఇక అమలా పాల్ లేటెస్ట్ సెన్సేషన్ సినిమా తమిళంలో ‘ఆడై’ , తెలుగులో ఆమె గా ఒకేసారి రెండు భాషల్లో గత శుక్రవారం రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమలా న్యూడ్ గా నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. న్యూడ్‌గా నటించి, అద్భుతమైన నటనను కనబరిచినా ఈ సినిమాకు ఆశించిన వసూళ్లు రావడం లేదు. 

ఇక తెలుగులో అయితే ప్రింట్ ఖర్చులకి కూడా డబ్బులు రావడం లేదని టాలీవుడ్ మీడియా సమాచారం. అంటే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. 
ఏ స్టార్ హీరోయిన్ చేయని విధంగా అమలా పాల్ న్యూడ్‌ గా నటించినప్పటికీ జనాలు ఎవరు ఈ సినిమా పట్టించుకోవట్లేదు. టీజర్‌లో ఉన్న సీన్ తప్ప సినిమాలో పెద్దగా ఏమీ ఉండదు అని చాలామంది ప్రేక్షకులు ఈ సినిమాని లైట్‌ తీసుకున్నట్టున్నారు. కానీ విషయం ఏంటంటే ఈ సినిమా ఇంటర్వెల్ తరువాత నుండి అమలా పాల్ దాదాపు ఒక గంట సేపు నగ్నంగానే కనిపిస్తుంది. పాపం అమల ఇంత రిస్క్ చేసి సినిమా చేసినా వసూళ్లు మాత్రం రావడంలేదు.

పైగా అమలా ఈమూవీ రిలీజ్ కి ముందు రెండున్నర నిమిషాల సీన్‌ ఒకటి స్వయంగా రిలీజ్ చేసింది. కానీ జనాలు దీన్ని పట్టించుకోలేదు. ఇది జస్ట్ డేరింగ్ అటెంప్ట్ తప్ప వసూళ్లు వచ్చే సినిమా కాదని ట్రేడ్ చెబుతుంది. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అందుకే స్వయంగా అమలనే రెమ్యునిరేషన్ కూడా తీసుకోకుండా ఈ ప్రాజెక్ట్ చేసింది. అంతేకాదు ఎదురు డబ్బు కూడా పెట్టిందట. ఇన్ని సాహసాలు చేసినా కూడా 'ఆమె' అమలకు ఏమాత్రం ఉపయోగపడలేదు పాపం.



మరింత సమాచారం తెలుసుకోండి: