కాజల్ అగర్వాల్.. అందానికి  అందం ఆ ముద్దు గుమ్మ. సాఫ్ రోల్స్ చేస్తూనే వేరే జోనర్లలోనూ తన సత్తా చాటగలదు. మగధీరుడి పక్కన యువరాణిగా మెరిసినా బోల్డ్ టైప్ సీతగా రఫ్ఫాడించినా కాజల్ కే చెల్లు. ఒక దశాబ్ద కాలం ఇండస్ట్రీని చూసిన వారు తక్కువమంది ఉంటారు. అందులో కాజల్ ఒకరు. ఆమె టార్గెట్ ఇపుడు వేరేగా ఉంది.


కాజల్ వయసు 34 అంటే షాక్ తినాల్సిందే. కాజల్ అందం ఎక్కడా చెక్కుచెదరలేదు. ఆ జిగి, బిగి అలాగే ఉంది. అందుకే హాట్ షోకి నేనూ రెడీ అంటోంది. ఏకంగా సొగసు సెగలు పుట్టించి రణరంగమే స్రుష్టిస్తానని అంటోంది. లేటెస్ట్ మూవీ రణ రంగంలో కాజల్ ఓ కీలకమైన రోల్ ప్లే చేస్తోంది. హీరో శర్వానంద్. డైరెక్టర్ సుధీర్ వర్మ.


ఈ మూవీ మొత్తం గ్యాంగ్ స్టర్  కధతో ఉంటుంది. ఫుల్ ఆఫ్ యాక్షన్ అన్న మాట. ఈ మూవీలో కాజల్ గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. సమ్మర్ టెంపరేచర్లను మళ్ళీ తెచ్చేసి నేను కూల్ చందమామను కానంటోంది. ఈ మూవీకి కాజల్ గ్లామర్ షో అతి పెద్ద ప్లస్ పాయింట్ అని చిత్ర యూనిట్ నమ్ముతోంది.


 కాజల్ సైతం మళ్ళీ ఫాం లోకి రావాలంటే గ్లామర్ దట్టించక తప్పదంటోంది. మొత్తానికి ఆగస్ట్ లో వస్తున్న రణరంగం కుర్రకారు గుండెల్లో అణు యుద్ధమే చేయిస్తుందని అంటున్నారు. దటీజ్ కాజల్.


మరింత సమాచారం తెలుసుకోండి: