ప్రస్తుతం తెలుగులో వస్తున్న బిగ్ బాస్ 3 నిన్నటితో మూడో రోజుకి చేరుకుంది.  ఇంటిలో 14 మంది కంటెస్టంట్లతో సందడి మొదలైంది.  అయితే బిగ్ బాస్ 3 మొదలు కాకముందే ఎన్నో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. తొలి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో హోస్ట్‌గా వ్యవహరించడంతో మంచి పాపులారిటీ వచ్చింది. అంతేకాకుండా వ్యాఖ్యాతగా ఎన్టీఆర్ అదరగొట్టడంతో షో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక, రెండో సీజన్‌కు నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 

యాంకర్ శ్వేతారెడ్డి  బిగ్ బాస్‌ షోపై తీవ్ర ఆరోపణలు చేశారు. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ మాదిరిగా బిగ్ బాస్ షోలోనూ ‘కమిట్‌మెంట్స్’ ఉన్నాయని ఆరోపిస్తున్నారు. బిగ్ బాస్‌కి మిమ్మల్ని సెలెక్ట్ చేశాం అని చెప్పారు. ఒకసారి కలవాలి అంటే ఆఫీస్‌కి రండి అని చెప్పాను. నా ఆఫీసుకొచ్చి నన్ను కలిశారు. వివరాలన్నీ చెప్పారు.. మీకు ఆసక్తి ఉందా అని అడిగారు.  మీరేమైనా నా నుంచి ఆశిస్తున్నారా అని నేను అడిగాను. అదికాదు మేడం మా బాస్‌ని ఇంప్రస్ చేయగలగాలి అన్నారు’ అని శ్వేతారెడ్డి చెప్పుకొచ్చారు.

అప్పుడు అర్థమైంది..ఇక్కడ కూడా కాస్టింగ్ కౌచ్ మొదలైందని, దాంతో బిగ్ బాస్ నిర్వాహకులపై కేసు పెట్టానని చెప్పారు శ్వేతారెడ్డి. ఈ నెల 13న శ్వేతారెడ్డి ఫిర్యాదు ఇవ్వగా, శ్యామ్, రవికాంత్‌, రఘు, శశికాంత్‌ లపై పోలీసులు కేసులు పెట్టారు. నాటి నుంచి పోలీసుల విచారణకు హాజరుకాని వారు, బుధవారం నాడు నాంపల్లి కోర్టుకు హాజరై, ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లను దాఖలు చేశారు.

యాంకర్ శ్వేతారెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో నిందితులుగా పేర్కొన్న నలుగురికి ముందస్తు బెయిల్ లభించింది. ఈ నేపథ్యంలో తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, పోలీసుల విచారణకు సహకరిస్తామని చెప్పారు. దీంతో వారికి ముందస్తు బెయిల్ ను మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసులో స్టార్‌ మా చానెల్ అడ్మిన్‌ హెడ్‌ కు కూడా పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: