అక్కినేని కోడలిగా మారాకా సమంత క్రేజ్ డబుల్ అయ్యిందని చెప్పొచ్చు. ఇన్నాళ్లు కమర్షియల్ హీరోయిన్ గా స్టార్ సినిమాల్లో నటించిన సమంత ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. రంగస్థలం తో సూపర్ హిట్ కొట్టిన సమంత ఆ తర్వాత యూటర్న్, మజిలీ, ఓ బేబీ సినిమాలతో తన సక్సెస్ జోరు కొనసాగిస్తుంది.


ఓ బేబీ సినిమా ఓవర్సీస్ లో 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసి సోలోగా కూడా సమంత సత్తా చాటేలా చేసింది. ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళ భాషల్లో మరో ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేస్తుందట సమంత. పెళ్లైంది కదా అని ఆమెకు స్టార్ ఛాన్సులు రావట్లేదు. అయితే సమంత మాత్రం తాను అన్ని సినిమాలు చేసేందుకు రెడీ అంటుంది.


కమర్షియల్ సినిమాలకు తాను సిద్ధమని.. స్టార్ సినిమాల్లో కావాల్సిన గ్లామర్ షో కూడా చేసేందుకు తను ఓకే అంటుంది సమంత. పెళ్లి తర్వాత హీరోయిన్ గా తన ఇమేజ్ ను ఏమాత్రం తగ్గించుకోని సమంత చూస్తుంటే హీరోయిన్ గా ఓ సరికొత్త ట్రెండ్ సృష్టించేలా ఉంది. అయితే సమంత చేస్తానని చెప్పినా స్టార్ హీరోలు ఆమెకు అవకాశం ఇవ్వాలిగా అంటున్నారు ప్రేక్షకులు.


ఏది ఏమైనా పెళ్లైతే హీరోయిన్స్ కెరియర్ ముగిసినట్టే అన్న వాదనకు సమాధానంగా సమంత వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. హీరోయిన్ గా సమంత మరెన్నో ప్రయోగాలు చేసి ఎన్నో ఘన విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నారు ఆమె అభిమానులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: