రాజమౌళి ఇటీవల సడెన్ గా అమెరికా వెళ్లారు.  అదే సమయంలో అక్కడ తానా సభలు జరుగుతున్నాయి.  ఆ సభల్లో పాల్గొనడానికి వెళ్లారేమో అనుకున్నారు.  అక్కడి నుంచి ఆహ్వానం అందినా రాజమౌళి ఆ సభకు వెళ్ళలేదు.  కారణం ఏంటి అన్నది వేరే విషయం.  


పర్సనల్ పనిమీద అమెరికాకు వెళ్లారని అప్పట్లో వార్తలు వచ్చాయి.  కానీ, రాజమౌళి అమెరికా అంత సడెన్ గా వెళ్ళడానికి బోలెడంత కారణం ఉన్నది.  ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ను పక్కన పెట్టి అలా టూర్ కు వెళ్ళడానికి ఎవరూ ఒప్పుకోరు.  


రాజమౌళే దర్శకుడు కాబట్టి అస్సలు కుదరదు.  అసలు అమెరికా ఎందుకు వెళ్లారు అంటే... ఎన్టీఆర్ హీరోయిన్ కోసం అంటున్నారు. ఎన్టీఆర్ కు జోడిగా మొదట డైసీ ఎడ్గర్ అనుకున్నారు.  కానీ, ఆమె కొన్ని కారణాల ఆలనా పక్కకు తప్పుకుంది.  


ఆమె స్థానంలో దేశీ హీరోయిన్ను తీసుకోవాలని అనుకున్నా.. కథ ప్రకారం విదేశీ వనిత కావాలి.  రాజమౌళి కథ విషయంలో అస్సలు రాజీపడరు. పర్ఫెక్ట్ గా రావాలని అనుకునే టైపు.  అందుకే అమెరికా వెళ్లి అక్కడ హాలీవుడ్ హీరోయిన్ ను ఆర్ఆర్ఆర్ మూవీ కోసం సెట్ చేశారని, అక్కడే ఆమెకు సంబంధించిన స్క్రిప్ట్ విషయాలు మాట్లాడారని సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: