సినిమాల్లో ఇప్పుడు కంటెంట్ కంటే బూతు కామెడీ, గ్లామర్ సన్నివేశాలు, ఘాటైన ముద్దులు ఇవే ఎక్కువగా ఉంటున్నాయి.  వీటితోనే సినిమా నడుస్తున్నది.  అర్జున్ రెడ్డి సినిమా తరువాత ఈ తరహా సినిమాల హడావుడి ఎక్కువైంది.  సీనియర్, యంగ్, జూనియర్ అనే తేడా లేదు.  ఎవరైనా సరేసినిమా తీస్తున్నారు అంటే మినిమమ్ ఇవి కావాల్సిందే.  


ఒకప్పుడు మంచి కథ, కథనాలు, ఆరు పాటలు, నాలుగు ఫైట్లు.  కాలం మారడంతో దానికి తగ్గట్టుగానే అన్ని మారిపోయాయి.  మార్పులు జరుగుతున్నాయి.  టాలీవుడ్ లో సీనియర్ హీరో నాగార్జున కూడా యూత్ తో పోటీ పడి సినిమాలు చేస్తున్నాడు.  గ్లామర్ గా కనిపిస్తూ.. హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు.  


మన్మధుడు 2 సినిమాలో నాగ్ చేసిన రొమాంటిక్ అల్లరి అంతాఇంతా కాదు.  రకుల్ ప్రీత్ తో ప్రేమలో పడే సన్నివేశాలు ట్రైలర్ లో చూపించారు.  ఇక మరో హీరోయిన్ తో ఆయన చేసిన రొమాన్స్ కు హద్దులేదు.  ముద్దులతో ముంచెత్తాడు.  పైకి రాముడిలా కనిపించినా.. తెరవెనుక శ్రీకృష్ణుడిలా ఉంటాడు.  


ఒకపూట భోజనం వరకు వ్యవసాయం చేయలేను అని చెప్పే డైలాగ్ వెనుక రహస్యం ఏంటో అర్ధం అవుతుంది.  నేను పిల్లల్ని కనను.  నా జీవితం నావరకు అంతే అని చెప్పే డైలాగులు సినిమాకు ప్లస్ అవుతాయి.  ట్రైలర్ తో అలరించిన నాగ్.. మరి సినిమాలో ఎలాంటి రొమాన్స్ చేశాడో.. సమంత పాత్ర ఏంటో.. కీర్తి సురేష్ క్యారెక్టర్ ఏంటో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: