వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రామ్, పూరీ జగన్నాథ్ ఇద్దరికీ ఇస్మార్ట్ శంకర్ రూపంలో హిట్ సినిమా వచ్చింది. వీకెండ్లో జోరు చూపించిన ఇస్మార్ట్ శంకర్ సోమవారం నుండి కలెక్షన్లు తగ్గినప్పటికీ పరవాలేదనే రేంజులో కలెక్షన్లు రాబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల 25 లక్షల షేర్ సాధించిన ఇస్మార్ట్ శంకర్ ప్రపంచ వ్యాప్తంగా 27 కోట్ల 70 లక్షల షేర్ సాధించడం విశేషం. హీరో రామ్ కెరీర్లోనే ఇస్మార్ట్ శంకర్ సినిమా హైయెస్ట్ కలెక్షన్లు సాధించింది. 
 
కలెక్షన్ల విషయానికి వస్తే నైజాంలో 11 కోట్ల షేర్ సాధించింది ఇస్మార్ట్ శంకర్. సీడెడ్ ఏరియాలో 4 కోట్ల 20 లక్షలు, వైజాగ్ ఏరియాలో 2 కోట్ల 97 లక్షలు, కృష్ణా జిల్లాలో కోటీ 60 లక్షలు, గుంటూర్ జిల్లాలో కోటీ 70 లక్షలు, నెల్లూర్ జిల్లాలో 84 లక్షలు, గోదావరి జిల్లాల్లో 2 కోట్ల 94 లక్షల కలెక్షన్లు సాధించటం విశేషం. ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వటంతో ఈ సినిమాలో నటించిన నిధి అగర్వాల్, నభా నటేశ్ ఇద్దరికీ కొత్త సినిమా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తుంది. 
 
ఇస్మార్ట్ శంకర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో హిట్ అయినప్పటికీ ఓవర్సీస్లో మాత్రం నామమాత్రంగా కూడా ప్రభావం చూపలేకపోయింది. ఓవర్సీస్లో మాస్ సినిమాలాకు ఆదరణ తక్కువగా ఉంటుంది. ఇస్మార్ట్ శంకర్ పూర్తి స్థాయి మాస్ సినిమా కావడంతో ఓవర్సీస్లో ఈ సినిమా డబుల్ డిజాస్టర్ అయింది. ఫుల్ రన్లో ఈ సినిమా 3 లక్షల డాలర్లు అందుకోవచ్చని తెలుస్తుంది. కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని రామ్ తన కొత్త సినిమా వివరాలు ప్రకటిస్తారని సమాచారం అందుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: