'ఆమె' సినిమాలో నగ్నంగా నటించిన అమలా పాల్‌, ఆ సినిమాలోని ఒక అనుభవాన్ని ఇలా ఒక ఇంటర్వ్యూలో ఇలా వివరించింది.

'' అసలు మళ్లీ సినిమాలు చేయాలనిపించలేదు ఓ దశలో సూడో ఫెమినిస్టు కథలతో కొందరు నిర్మాతలు వచ్చారు. నచ్చలేదు. అలాంటి సమయంలో 'ఆమె' సినిమాలోని పాత్ర దొరికింది. అప్పటికి చాలారోజులైంది కదా, నేను ఈ నవీనలోకానికి దూరంగా ఉంటూ, ఆ పాత్ర బోల్డ్‌నెస్‌ అర్థం చేసుకోవటానికి, ఆవాహన చేసుకోవటానికి అర్బన్‌ ప్రాంతాల్లో తెగ తిరిగాను, మాల్స్‌ లో కలియతిరుగుతూ అందర్నీ అబ్జర్వ్‌ చేసేదాన్ని.

యోగా బంద్‌ అయిపోయింది. దర్శకుడు నన్ను అంత వీజీగా ఏమీ పనిచేయనివ్వలేదు. దర్శకుడు నాతో సిక్స్‌ ప్యాక్‌ కోసం వర్కవుట్స్‌ చేయించినంతగా ఎక్సర్‌సైజు చేయించాడు. ఆ కామిని పాత్ర స్వతంత్రురాలు, ఆవేశపరురాలు, స్వార్థపరురాలు, తాగుతూ,తిరుగుతుంది. అప్పట్లో ఇరవైలో నేనూ అలాగే ఉన్నాను... నగ్నంగా ఓ సీన్‌ చేయడం కూడా, రిస్కే కానీ, మా మేనేజర్‌ను పిలిచి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో ముందే చెప్పాను. ఆ సీన్‌ చేసేటప్పుడు అక్కడున్న ఎవరి వద్దా మొబైల్‌ ఫోన్లు లేవు. లేకుండా చేశాం. మొత్తం 15 మంది ఉన్నారు.

నిజం చెప్పొద్దూ... 15 మంది భర్తలున్న పాంచాలిని అనిపించి నవ్వొచ్చింది. షూట్‌ అయిపోయంది. పెద్ద రిలీఫ్‌, ఎందుకో మొదటిసారి నా దేహం నాకు సౌకర్యంగా అనిపించింది... వంద శాతం ఎఫర్ట్‌ పెట్టానా లేదా..? అదొక్కటే ఆలోచించాను. ఈ సీన్‌ నాకెంత ధైర్యాన్నిచ్చిందీ అంటే, నేనే ఓ సినిమా సొంతంగా తీద్దామని నిర్ణయించుకునేంతగా...!

మొదట్లో నిజానికి బాగా కష్టపడేదాన్ని, టెన్షన్‌ ఉండేది, ఏదో ఇన్‌ సెక్యూరిటీ అనిపించేది. నా లక్‌ కొద్దీ వైవిధ్యభరితమైన పాత్రలే దక్కాయి. నా పెళ్లి వైఫల్యం నా కళ్లు తెరిపించింది. లోకం ఏమిటో చూపించింది. అబద్ధపు మనుషులతో ఎలా మెలగాలో నేర్పించింది.'' అని తన మనసులో మాటలు చెప్పింది అమల.


మరింత సమాచారం తెలుసుకోండి: