మహేష్ బాబు కు ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సవాల్ విసిరేందుకు సిద్దమయ్యాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటి వారిద్దరికి మంచి సత్సంబందాలు ఉన్నయి. వారి కాంబినేషన్ లో టాలీవుడ్ లో బాక్సాఫీసులు బద్దలయ్యే హిట్లు ఇచ్చారు, అలాంటిది సవాల్ విసరడమేంటి అనుకుంటున్నారా..

ప్రొఫేషన్ అన్నాకా ఒక్కోసారి ఇలాంటి చాలెంజ్ లు తప్పవంటున్నారు. అయితే పూరి విసురుతున్న సవాల్ కూడా టాలీవుడ్ లో చర్చనీయాంశం కావడానికి కారణం, పూరి సామాన్యుడు కాకపోవడం, ఎందుకంటే ఇదే మహేష్ బాబు తో పోకిరి, బిజినెస్ మెన్ వంటి హిట్లు ఇచ్చాడంటే ఆయన ఎంతటి మొనగాడో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఆ సవాల్ ఏంటి అనుకుంటున్నారా... మహేష్ ప్రతిష్టాత్మకంగా తీసి తెరపైకి వస్తున్న ‘వన్ నేనొక్కడినే’ సినిమాకే ఆయన చాలెంజింగ్ విసురుతున్నాడు. ఈ సినిమా విడుదలవుతున్న సంక్రాంతికే తాను తీస్తున్న ‘హార్ట్ ఎటాక్’ సినిమాను విడుదల చేస్తున్నాడట. ‘గుండె జారీ గల్లంతయ్యిందే’ వంటి సినిమా హిట్టుతో మాంచి ఊపు మీదున్న నితిన్ హీరోగా అదాశర్మ హీరోయిన్ గా ఈ సినిమా వస్తోంది. అందుకే మహేష్ బాబు ‘వన్’ కు ఇది సవాల్ లాంటిదే అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: