మ‌హాభార‌త కావ్యాన్ని తొలిసారిగా ఇండియ‌న్ స్క్రీన్‌మీద 3డిలో చూడ‌బోతున్నాం. ఈ చిత్రంలో యాక్ష‌న్ కింగ్ అర్జున్ క‌ర్ణుడుగా ద‌ర్శ‌న్ దుర్యోధ‌నుడిగా, సోనూసూద్ అర్జునుడిగా, అభిమ‌న్యుడిగా అఖిల్‌గౌడ్‌, కృష్ణుడిగా ర‌విచంద్ర‌న్ న‌టించ‌గా ద్రౌప‌దిగా స్నేహ న‌టించారు. ఈ చిత్రం ఒకేసారి ఐదుభాష‌ల్లో విడుద‌ల‌వ్వ‌డం విశేషం. రాక్‌లైన్ వెంక‌టేష్‌గారు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. వృష‌భాద్రి ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకం పై మునిర‌త్న (ఎంఎల్ఎ) నిర్మించారు. నాగ‌న్న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైల‌ర్, ఆడియో లాంచ్‌ బుధ‌వారం ఎఎంబిలో ప్ర‌ముఖ నిర్మాత‌లు బివిఎస్ఎన్ ప్ర‌సాద్‌, బ‌న్నీవాసుల చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో...


బివిఎస్ ఎన్ ప్ర‌సాద్ మాట్లాడుతూ...  నేను ఎప్ప‌టి నుంచో భార‌తాన్ని 3డిలో చేయాల‌నుకున్నాను. నేను భావించిన‌ట్లే 3డిలో మొట్ట‌మొద‌టిసారి ఆల్ ఓవ‌ర్ ఇండియాలో విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది.  టీం అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు.


బ‌న్నీవాసు మాట్లాడుతూ...ఈ క‌థ‌ని 3డిలో తియ్యాల‌ని ప్రేక్ష‌కుల‌కు అందించాల‌ని రాక్‌లైన్ వాళ్ళ‌కి ముందుగా నా కృత‌జ్ఞ‌త‌లు. ఎందుకంటే రామాయ‌ణం, భార‌తం లాంటివి ప్ర‌స్తుతం జ‌న‌రేష‌న్‌కి తెలియ‌వు. ఎవెంజ‌ర్స్‌, హ‌ల్క్ ఇంకా ఇలాంటి వ‌న్నీ క్యారెక్ట‌ర్స్ త‌ప్ప మ‌న భార‌తంలో కూడా హ‌ల్క్ లాంటి బ‌ల‌మైన‌వాళ్ళు ఉన్నార‌ని ప్ర‌స్తుతం జ‌న‌రేష‌న్‌కి తెలియ‌దు. నేను నా పిల్ల‌ల‌ను త‌ప్ప‌కుండా ఈ సినిమాకి తీసుకువెళ్ళి చూపిస్తాను.  ఇంత మంచి చిత్రాన్ని అందిస్తున్న మునిర‌త్న‌గారికి నా కృత‌జ్ఞ‌త‌లు అని అన్నారు.


ప్రొడ్యూస‌ర్ మునిర‌త్న మాట్లాడుతూ... భార‌తం వేరు బాహుబలి వేరు కొన్ని స‌బ్జెక్ట్స్ ఒక్క‌సారే పుడ‌తాయి. అవి ఎవ్వ‌రూ చెయ్య‌లేరు. మ‌ళ్ళీ పుట్ట‌వు. క‌న్న‌డ సినిమా ఇండ‌స్ట్రీ చాలా చిన్న‌ది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సోనూసూద్ ఛాలెంజింగ్ స్టార్ అర్జునుడుగా చూడొచ్చు. ఐదు భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చెయ్య‌డం చాలా ఆనందంగా ఉంది.నాకు ఇంత మంచి అవ‌కాశం క‌ల్పించిన మీ అంద‌రికి నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.
హీరో అర్జున్ మాట్లాడుతూ... చిత్ర నిర్మాత‌కి, రాక్‌లైన్ వెంక‌టేష్‌గారికి, ద‌ర్శ‌న్‌గారికి, బ‌న్నీవాసుగారికి అంద‌రికీ ముందుగా నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. ఇంత మంచి చారిత్రాత్మ‌క చిత్రంలో న‌టించ‌డం చాలా ఆనందంగా ఉంది. ప్రొడ్యూస‌ర్ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా చాలా బాగా తీశారు. సినిమాలో నా క్యారెక్ట‌ర్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు. అన్ని ర‌సాలు ఉన్న పాత్ర నాది. సినిమాని అంద‌రూ త‌ప్ప‌కుండా చూడండి. మీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌కి ఏమాత్రం త‌గ్గ‌దు.


డైరెక్ట‌ర్ నాగ‌న్న మాట్లాడుతూ... ఈ చిత్రంలో ద‌ర్శ‌న్ దుర్యోధ‌న పాత్ర పోషించారు. గుడ్డివారిలా ఆ పాత్ర ఎలా చేశారు అన్న‌దాని గురించి చెప్ప‌క్క‌ర్లేదు. మునిర‌త్న‌గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా చాలా బాగా తీశారు. మ‌న భార‌త‌దేశంలో మొట్ట‌మొద‌టిసారిగా 3డిలో సినిమా చేసిన క్రెడిట్ ఆయ‌న‌కే ద‌క్కుతుంది. కురుక్షేత్రం చిత్రం అంటేనే పండ‌గ‌లా ఉంటుంది.  మీ అంద‌రి స‌పోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: