అక్కినేని నాగార్జున నటవారుసులుగా ఇప్పటికే అక్కినేని నాగచైతన్య మరియు అఖిల్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చి, వరుస సినిమాలతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అయితే నాగచైతన్య కెరీర్ పరంగా ఇప్పటికే మంచి సినిమాలు చేస్తూ సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతుంటే, అఖిల్ కు మాత్రం చేసిన మూడు సినిమాల్లో ఏదీ కూడా అయనకు కెరీర్ పరంగా మంచి సక్సెస్ ని అందించలేదనే చెప్పాలి. ఇకపోతే ఇటీవల బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటించబోయే నాలుగవ సినిమా వేడుకగా ప్రారంభమయింది. 

గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు మరియు వాసు వర్మ నిర్మాతలుగా భారీ ఖర్చుతో నిర్మితం అవుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. అతి త్వరలో గ్రాండ్ లెవెల్ లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాపై నేడు ఒక వార్త, పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే, ఈ సినిమాలో అఖిల్ ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడని, మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు అయన ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు సినిమాలో పుష్కలంగా ఉండనున్నాయని అంటున్నారు. అంతేకాక తన సినిమాలకు ఎక్కువగా శ్రోతలను ఆకట్టుకునే పాటలను ఎంపిక చేసుకునే భాస్కర్, ఈ సినిమా మ్యూజిక్ విషయమై కూడా మరింత శ్రద్ధ కనపరుస్తున్నారట. కేవలం మ్యూజిక్ మాత్రమే కాక, సినిమా గురించిన ప్రతి అంశాన్ని ఎంతో శ్రద్ధను కనబరుస్తోందట యూనిట్. 

ఎలాగైనా తమ సినిమాను మంచి సక్సెస్ చేయాలనే భావనతో కష్టపడి పనిచేయాలని నిర్ణయించారట. అతిత్వరలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల మునకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతరనటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడి కావలసి ఉంది. దీన్ని బట్టి ఇప్పటివరకు సరైన సక్సెస్ ని చూడని అఖిల్, ఈ సినిమాతో తన బాక్సాఫీస్ స్టామినా చూపించనున్నట్లు సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజం ఎంతవరకు ఉందొ తెలియదు గాని, ఎప్పటినుండో తమ అభిమాన హీరోకు సరైన హిట్ పడితే చూడాలని ఆశ పడుతున్న అఖిల్ ఫ్యాన్స్ కోరికను ఈ సినిమా తీరిస్తే మాత్రం వారి ఆనందానికి హద్దే ఉండదు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: