2000 లో హేరామ్ సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది కమల్ హాసన్ కూతురు శ్రుతిహాసన్. 2009లో లక్ అనే బాలీవుడ్ సినిమాతో హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహించిన అనగనగ ఒక ధీరుడు సిద్ధార్థ్ సరసన తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. అప్పటికే కొన్ని ఫ్లాప్స్ ని చూడటంతో శృతిని ఐరెన్ లెగ్ అన్న వాళ్ళు ఉన్నారు. కానీ గబ్బర్ సింగ్ తో కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకొని అందరికి షాక్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ సరసన ఈ సినిమాలో భాగ్యలక్ష్మి పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత శ్రుతి కెరీర్ గురించి తెలిసిందే. తెలుగు-తమిళ పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్ గా తండ్రి సపోర్ట్ లేకుండా పాపులారిటీని సంపాదించుకుంది. అంతేకాదు హిందీలోనూ స్టార్ డమ్ ని పెంచుకుంది. 


అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే శ్రుతి వ్యక్తిగత జీవితం ముఖ్యం అంటూ సినిమాలకు దూరం అయింది. విదేశీ బోయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో ప్రేమాయణం సాగించింది. ఇక అతడిని పెళ్లాడేయబోతోందనే ప్రచారం సాగింది. కానీ ఇంతలోనే మనస్ఫర్థలతో విడిపోయి తిరిగి మళ్ళీ సినీ కెరీర్ పై దృష్టి పెంచింది. ప్రస్తుతం కోలీవుడ్ లో విజయ్ సేతుపతి సరసన లాభం అనే సినిమాలో నటిస్తోంది. టాలీవుడ్ లో రవితేజతో ఒక సినిమా చేయనుందని ఇంతకముందే కన్‌ఫర్మ్ చేసింది. అలాగే అమెరికన్ క్రేజీ వెబ్ సిరీస్ (ట్రెడ్స్టోన్లో) శృతి హాసన్ కీలక పాత్రకు ఎంచుకున్నారు కూడా. రామిన్ బహ్రానీ ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించనున్నారు. ఇక కెరీర్ 10 ఏళ్ళు పూర్తయిన ఆనందంలో శృతి హాసన్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులకి కృతజ్ఞతలు తెలియజేసింది.


 సినీపరిశ్రమలో నా కెరీర్ పదేళ్లు పూర్తయింది. ఇక్కడ ఎంతో నేర్చుకున్నాను. నన్ను ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు. మీరంతా గర్వించేలా హార్డ్ వర్క్ చేస్తానని.. మరింత బెటర్ గా వర్క్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నా అని శ్రుతిహాసన్ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. మరి ఇప్పటినుంచైనా ప్రేమాయణాలు సాగించకుండా కంప్లీట్ గా తన కెరీర్ మీద దృష్టి పెడుతుందే లేదో చూడాలి. అసలే హీరోయిన్స్ కి ఇండస్ట్రీలో స్పాన్ తక్కువ అన్న విషయం తెలిసిందే. ఇందులో స్టార్ కూతుళ్ళ కి మినాహాయింపు ఏమీ ఉండదు.



మరింత సమాచారం తెలుసుకోండి: