ఇండస్ట్రీలో ఐరెన్ లెగ్ అనే పదం ఎక్కువగా హీరోయిన్స్ కే వర్తిస్తుంది. డెబ్యూ మూవీ గనక హిట్ అయితే ఇక దర్శక నిర్మాతలు ఆ హీరోయిన్ వెనకే క్యూ కడతారు. వాళ్ళే రెమ్యునిరేషన్ అమాంతం పెంచేస్తారు. అంతేకాదు హీరోస్ కూడా ఆ హీరోయిన్ కావాలనే పట్టు బడతారు. అదే ఒక్క సినిమా గనక డిజాస్టర్ అయితే మాత్రం తలుపులేసేస్తారు. న్యాచురల్ స్టార్ నాని మజ్నుతో టాలీవుడ్ కు పరిచయమై తక్కువ గ్యాప్ లోనే విశాల్ లాంటి స్టార్ల సరసన నటించే ఛాన్స్ కొట్టేసిన అను ఇమ్మానియేల్ ఈ మధ్య పూర్తిగా కనిపించడం మానేసింది. గత ఏడాది క్రేజీ ప్రాజెక్ట్స్ చేసినా ఒకదానికి మించి మరొకటి డిజాస్టర్లు కావడంతో కెరీర్ రిస్క్ లో పడింది. నిజానికి అనుకి లాస్ట్ ఇయర్ వచ్చినవి మంచి ఆఫర్సే. పవన్ కళ్యాణ్ తో నటించే అదృష్టం ఎప్పుడు దక్కుతుందా అని సీనియర్ హీరోయిన్లే ఎదురు చూసే టైంలో అనుకి అజ్ఞాతవాసి వచ్చింది. కానీ అది పెద్ద డిజాస్టర్ గా మిగలడంతో ఆశలు ఆరిపోయాయి.


అయినప్పటికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. హీరో మారాడు కానీ ఫలితం రిపీట్ అయ్యింది. దెబ్బకు బన్నీ ఏడాది పైగా గ్యాప్ తీసుకున్నాడంటే ఆ సినిమా ప్రభావం గురించి వేరేగా చెప్పాల్సిన పనిలేదు. ఇక నాగ చైతన్యకు ష్యుర్ షాట్ హిట్ గా అందరూ అంచనా వేసిన శైలజారెడ్డి అల్లుడు కూడా బోల్తా పడింది. ఇది కూడా పెద్ద డిజాస్టర్ గానే మిగిలిపోయింది. ఇలా ముగ్గురు స్టార్లతో చేసినా అనుకు లాభం లేకుండా పోవడం కేవలం బ్యాడ్ లక్కే అని చెప్పాలి. పై మూడు సినిమాలలో ఏ ఒక్కటీ సూపర్ హిట్టయినా అనూ కెరీర్ వేరేలా ఉండేదేమో పాపం. 


ఇప్పుడు అనూ చేతిలో సినిమాలు ఉన్నట్టు కనిపించడం లేదు. తమిళ్ లో శివ కార్తికేయన్ సరసన ఓ సినిమా చేస్తోందన్న టాక్ వచ్చింది కానీ ఆ సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్స్ కూడా రావడం లేదు. తక్కువ టైంలోనే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిన హీరోయిన్ల లిస్ట్ లోకి అను వెళ్లేలా కనిపిస్తోంది. బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే ఎవరైనా స్టార్ హీరో ఇంకో ఛాన్స్ ఇస్తే అది హిట్ అయితే తప్ప అనూకి ఇంకో ఆప్షన్ కనిపించడం లేదు. కనీసం సోషల్ మీడియాలోనైనా కాస్త యాక్టివ్ గా హాట్ హాట్ ఫోటోస్ తో టచ్ లో ఉంటుందనుకుంటే అక్కడా పెద్దగా కనిపించడం లేదు. ఇలా అయితే ఎలా అనూ..! 



మరింత సమాచారం తెలుసుకోండి: