సినిమాల్లో హిట్లిస్తేనే మనుగడ. లేదంటే ట్రాక్ రికార్డు కూడా చూడరు. ఒకప్పుడు పూరి కోసం క్యూ కట్టిన వారందరూ టెంపర్ తరువాత అతనిని పట్టించుకోవడం మానేశారు. ఇది పూరికే కాదు.. ఎందరో దర్శకులకు ఎదురైన అనుభవం. అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీలో శుక్రవారం నెగ్గిన వాడే విన్నర్ అంటారు. హీరో హీరోయిన్లకైనా, దర్శకులకైనా ఇవే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతూంటాయి.


“ఏడు వరుస హిట్లిచ్చినప్పుడు నాకోసం తిరిగినవారు, ఎనిమిదో సినిమా ఫ్లాప్ అవగానే ఎయిర్ పోర్టుకు వచ్చి నన్ను పికప్ చేసుకునేవారు లేకపోయారు. నాకు నేను టాక్సీ బుక్ చేసుకుని వచ్చాను. హిట్ ఇస్తేనే ఇక్కడ వెలుగు, లేకపోతే చీకటే.. చిన్న సినిమాల మీద దృష్టిపెట్టు, భవిష్యత్తుకు ఉపయోగపడుతిం” అని దాసరి నారాయణరావు ఓసారి పూరి జగన్నాధ్ కు చెప్పారట. పూరి విషయంలో నిజంగా ఇదే జరిగింది. మూడేళ్ల నుంచి పూరి వరుస ఫ్లాపులు ఇస్తుండటంతో పెద్ద పెద్ద హీరోలు ముఖం చాటేశారు. దీంతో చిన్న హీరోలతోనే సినిమాలు తీశాడు. తక్కువ బడ్జెట్, మీడియం రేంజ్ హీరోతోనే ఇండస్ట్రీకి ‘ఇదీ నేనంటే’ అని ప్రూవ్ చేశాడు. ఇస్మార్ట్ శంకర్ తో తన టాలెంట్ ను మర్చిపోయిన పెద్ద హీరోలకు తన పవర్ చూపించాడు.


జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు ముందు కూడా రాఘవేంద్రరావుకు మూడు వరుస ఫ్లాపులు ఉన్నాయి. కానీ ఆయనపై మెగాస్టార్ నమ్మకముంచి సినిమా అప్పగిస్తే చిరంజీవి కెరీర్ లో క్లాసిక్ గా ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. ఒక్కోసారి దర్శకులను నమ్మడమే చేయాల్సింది. రోజులు మారి ఆ పరిస్థితులు నేడు కనుమరుగైపోయాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా రామ్ చరణ్ ను ఇంట్రడ్యూస్ చేయడానికి పూరినే ఎంచుకున్నాడు. అప్పటి వరకూ మూసగా వెళ్తున్న ప్రభాస్ ని బుజ్జిగాడులో స్పెషల్ డైలాగ్ డెలివరీతో తన రూట్ నే మార్చేశాడు. అలాంటి పూరిని మూడేళ్లుగా పెద్ద హీరోలు అవకాశాలివ్వకపోవడం దారుణం. ఇస్మార్ట్ శంకర్ తోనైనా పూరి కి కాల్ చేస్తారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: