బిగ్ బాస్ సీజన్ 3లో 15 మంది కంటెస్టంట్స్ లో ఒకడిగా వచ్చాడు మహేష్ విట్ట. తెలుగువన్ ఫన్ బకెట్ లో కామెడీ పంచులతో అలరించిన అతను సినిమాల్లో ఛాన్సులు అందుకున్నాడు. ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టంట్ గా ఛాన్స్ అందుకున్నాడు. సినిమాల్లో కమెడియన్ కదా బిగ్ బాస్ హౌజ్ లో కామెడీ చేస్తాడని అనుకుంటే సీన్ రివర్స్ అయినట్టు కనిపిస్తుంది.


చిన్నప్పటి నుండి కష్టాల్లో పెరగడం వల్ల మహేష్ కేవలం స్క్రీన్ మీదే సరదాగా కనిపిస్తాడు కాని రియల్ లైఫ్ లో తను చాలా సీరియస్ అని తెలుస్తుంది. బిగ్ బాస్ కంటెస్టంట్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజులోనే మహేష్ రియల్ క్యారక్టర్ లో కామెడీ ఉండదని అర్ధమైంది. ఇక గురువారం ఎపిసోడ్ లో వరుణ్ తేజ్ భార్య వితికను డోర్ దగ్గర నిలబడి చేయి అడ్డుపెట్టి 'పో' అన్నందుకు వరుణ్ సందేశ్ మహేష్ విట్ట మీద ఫైర్ అయ్యాడు.   


ఆడవాళ్లకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చాడు. మహేష్ కూడా గట్టిగా అరవగా గొడవ మరింత పెద్దదైంది. మొన్న శ్రీముఖి, హిమజ.. నిన్న హేమ, రాహుల్ గొడవతో షో నడవగా ఈరోజు వరుణ్ సందేశ్ వర్సెస్ మహేష్ విట్ట గొడవ హాట్ న్యూస్ గా మారింది. హౌజ్ లో సరదాగా ఉంటారని అనుకున్న సభ్యులు మొదటి వారంలోనే తమ ఒరిజినాలిటీని బయటకు తీస్తున్నారు.        


మరి వీకెండ్ లో వీళ్లందరికి నాగార్జున పెద్ద క్లాస్ పీకే అవకాశం కనిపిస్తుంది. జరిగిన సంఘటన అది చిన్నదా పెద్దదా అని కాకుండా దాన్ని గొడవగా క్రియేట్ చేయడం ఇంటి సభ్యులకు అలవాటుగా మారింది. మరి వరుణ్ సందేశ్, మహేష్ విట్ట గొడవ రేపటికి కొనసాగేలా కనబడుతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: