కె.ఎస్‌.ర‌వికుమార్ త‌మిళంలో అగ్ర దర్శ‌కుడు.. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌, శ‌ర‌త్‌కుమార్‌, విజ‌య‌కాంత్‌, అజిత్‌, విజ‌య్ లాంటి అగ్ర‌హీరోలంద‌రితో  ప‌నిచేసి అంద‌రికీ హిట్‌లు ఇచ్చిన దిగ్ద‌ర్శ‌కుడు.. తమిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ తో ముత్తు సూప‌ర్‌హిట్ ఇచ్చిన ర‌వికుమార్‌, క‌మ‌ల్ హాస‌న్ తో తెనాలి, పంచ‌తంత్ర‌, ద‌శావ‌తారం లాంటి భారీ సినిమాలు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు..అంతే కాదు తెలుగులో కూడా చిరంజీవితో స్నేహం కోసం, నాగార్జున‌, రాజ‌శేఖ‌ర్, బాల‌క్రిష్ణ లాంటి పెద్ద‌హీరోల‌తో పనిచేసాడు..

2018లో బాల‌క్రిష్ణ‌తో చేసిన `జైసింహా` సినిమా బాక్సాఫీసు వ‌ద్ద విజ‌యం సాధించ‌డంతో ఇపుడు బాల‌క్రిష్ణ‌తో మ‌రో సినిమాకు శ్రీ‌కారం చుట్టాడు... పూజా కార్య‌క్ర‌మాలు కూడా అయ్యాయి...ఇందులో బాల‌క్రిష్ణ ప‌వ‌ర్‌ఫుల్ పోలీసు ఆఫీస‌ర్ అని స‌మాచారం.. ఇద్దరు హీరోయిన్ల‌లో ఇప్ప‌టికే శ్రీ‌య ఖాయం అయిన‌ట్టుగా తెలుస్తుంది.. మ‌రో హీరోయిన్‌గా బాలీవుడ్ న‌టి సోనాల్ చౌహాన్ ను తీసుకుంటున్న‌ట్టు టాలీవుడ్ స‌మాచారం.. బాల‌క్రిష్ణ‌తో విజ‌య‌వంత‌మైన లెజెండ్, డిక్టేట‌ర్ సినిమాల‌లో హీరోయిన్ గా చేసిన సోనాల్ చౌహాన్ ను ముచ్చ‌ట‌గా మూడోసారి ఎంపిక చేసారు..బాల‌క్రిష్ణ‌తో చేసిన సినిమాలు మిన‌హా బాలీవుడ్‌లో సోనాల్ కు హిట్‌లు లేన‌ట్టే..   34 ఏళ్ళ సోనాల్ చౌహాన్  టాలీవుడ్ లో మ‌రోసారి త‌న అద్రుష్టాన్ని ప‌రీక్షించుకోబోతుంది...


మరింత సమాచారం తెలుసుకోండి: