ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని ఫ్రెండ్ రోల్ చేసి అలరించిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు తర్వాత సరికొత్త సెన్సేషనల్ గా మారాడు. ఇక అర్జున్ రెడ్డితో మనోడి అసలు సిసలు స్టామినా ఏంటో తెలిసింది. సినిమా తప్ప మరోటి తెలియదు అనేలా నటుడిగా నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.


అర్జున్ రెడ్డి సినిమాతోనే అతనికి యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ పెరిగింది. ఆ తర్వాత గీతా గోవిందం సినిమా విజయ్ కు స్టార్ స్టేటస్ కట్టబెట్టింది. లాస్ట్ ఇయర్ వచ్చిన టాక్సీవాలా కూడా విజయ్ కు మంచి హిట్ ఇచ్చింది. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న విజయ్ దేవరకొండ మిగతా హీరోల మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తున్నాడు.


టాలీవుడ్ లో దశాబ్ధం నుండి యువ హీరోలు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక హిట్టు పడితే రెండు ఫెయిల్ అన్నట్టుగా ఫలితాలు ఉంటున్నాయి. కాని కేవలం 5 సినిమాలతో స్టార్ రేంజ్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. మిగతా వాళ్లు కష్టపడుతున్నా విజయ్ డిఫరెంట్ స్టైల్ లో ప్రేక్షకులతో ఎటాచ్ అవడం వల్ల ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది.


ముఖ్యంగా తన ఫ్యాన్స్ ను రౌడీస్ అంటూ విజయ్ దేవరకొండ పిలవడం ప్రత్యేకంగా ఉంటుంది. డియర్ కామ్రేడ్ విషయంలో అయితే విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ తో హంగామా సృష్టించాడు. ఓ మ్యూజికల్ ఈవెంట్ కూడా చేశారు. తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మళయాళంలో కూడా ఈరోజు డియర్ కామ్రేడ్ రిలీజ్ అవుతుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: