‘సైరా’ షూటింగ్ పూర్తి కావడంతో ఈమూవీ ఎడిటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఈమూవీ దర్శకుడు సురేంద్ర రెడ్డికి చారిత్రాత్మిక సినిమాల విషయంలో అనుభవం తక్కువ అన్న ఉద్దేశ్యంతో స్వయంగా చిరంజీవి ఎడిటింగ్ విషయంలో దృష్టి పెడుతున్నా ‘సైరా’ నిడివి చిరంజీవికి కూడ చుక్కలు చూపెడుతున్నట్లు టాక్. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ రన్ టైమ్ 3గంటల 30 నిముషాలు వచ్చినట్లు సమాచారం. ఎన్ని సార్లు చిరంజీవి ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని సలహాలు ఇచ్చినా ఈమూవీ నిడివి అంతకు మించి తగ్గడం లేదు అని అంటున్నారు. అయితే ఈమూవీని 3 గంటలకు కుదించాలి అని ఆలోచనలు చేస్తుంటే ఈమూవీలోని పాటలు కనీసం రెండు తీసివేయవలసి వస్తుందని టాక్. 

ఈమూవీ చారిత్రాత్మక కథ కావడంతో ఉయ్యాలవాడ జీవితం గురించి నేటితరం ప్రేక్షకులకు వివరించేలా సీన్స్ రావడంతో ఈమూవీ నిడివి పెరిగింది అని అంటున్నారు. దీనితో ఎంత ప్రయత్నించినా ఈమూవీ నిడివి 3 గంటల 15 నిముషాల లోపు కుదింపు జరగడం లేదనీ వార్తలు వస్తున్నాయి. 

దీనితో ఇంత నిడివి ఉన్న సినిమాను సగటు ప్రేక్షకుడు చూస్తాడా అన్న సందేహాలు చిరంజీవికి కలగడంతో ఈమూవీ ఎడిటింగ్ విషయంలో రాఘవేంద్రరావు రాజమౌళిల సలహాలు తీసుకుని ముందుకు వెళ్లాలని చిరంజీవి ఆలోచన అని అంటున్నారు. వాస్తవానికి రామ్ చరణ్ ‘రంగస్థలం’ ఎడిటింగ్ లో ఎన్నో సలహాలు ఇచ్చిన మెగా స్టార్ తన మూవీ ‘సైరా’ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉండటం ఆశ్చర్యంగా ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: