రకుల్ ప్రీతి సింగ్ ఇప్పటికి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. ఇప్పటికే దాదాపు అందరు హీరోలతోనూ నటించేసిన రకుల్ తొలిసారి సీనియర్ హీరో నాగ్ సరసన నటిస్తోంది. మన్మధుడు 2లో కేవలం నటించడం మాత్రంకాదు, ఇప్పటి దాకా ఒలకబోయనంత గ్లామర్ ను కురిపించేసింది. ఇప్పటివరకు విడుదలయిన టీజర్, ట్రయిలర్, స్టిల్స్ ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.


అయితే ఇంతలా నటించినందుకు రకుల్ రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా? జస్ట్ కోటి యాభై అయిదు లక్షలు మాత్రమే. అవును, మన్మధుడు 2 సినిమాకు రకుల్ రెమ్యూనిరేషన్ ఇదే. ఆ సినిమాలో హీరో తరువాత హయ్యస్ట్ రెమ్యూనిరేషన్ రకుల్ దే.


ప్రస్తుతానికి రకుల్ తెలుగులో చేస్తున్న సినిమాలు ఏవీ పెద్దగాలేవు. అయితే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాను రకుల్ వున్న కారణంగా హిందీ డబ్బింగ్, శాటిలైట్ మంచి రేటుకు అమ్మే అవకాశం వుంటుంది. ఆమె రెమ్యూనిరేషన్ అక్కడ గిట్టుబాటు అయిపోతుంది. దీనితో రకుల్ కు పెద్దగా హిట్స్ లేకపోయిన కోట్లు కోట్లు ఛార్జ్ చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: