ఒకప్పుడు దక్షిణాది సినిమాలను బాలీవుడ్ ప్రజలు చిన్న చూపు చూసేవారు. ఇడ్లీ సాంబార్ కథలంటూ హేళన్ చేసేవారు. కానీ పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఇప్పుడు బాలీవుడ్ చూపు మొత్తం దక్షిణాది సినిమాపైనే ఉంది. ఇక్కడ విడుదలవుతున్న సినిమాలను ఎంతో ఖర్చు పెట్టి రీమేక్ హక్కులను దక్కించుకుంటున్నారు.


బాహుబలి సినిమా విజయంతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీ పేరు మారుమోగిపోయింది. ఒక్కసారిగా అందరి దృష్టి తెలుగు సినిమాలపై పడింది. ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలు బాహుబలి రేంజ్ లో కాకపోయినా బాలీవుడ్ దృష్టిలో మాత్రం పడ్డాయి. బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన "కబీర్ సింగ్" తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.


ప్రస్తుతం మరో రెండు చిత్రాలు బాలీవుడ్ కి వెళ్ళనున్నాయి. విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్" బాలీవుడ్ లో రీమేక్ కానుంది. ఈ సినిమా  రీమేక్ రైట్స్ ని కరణ్ జోహర్ దక్కించుకున్నారు.
తెలుగులో ఇంకా విడుదల అవకముందే రీమేక్ కీ అమ్ముడవడం విశేషం. ఇక తాజా సమాచారం మేరకు మరొక తెలుగు చిత్రాన్ని కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. 


అది కూడా రీసెంట్ హిట్ చిత్రమని తెలుస్తోంది. అయితే ఆ చిత్రం ఏమిటనేది మాత్రం ఇంకా బయటికిరాలేదు. కొందరు నాగ చైతన్య చేసిన ‘మజిలీ’ అంటుంటే ఇంకొందరు దేవరకొండ చేసిన ‘గీత గోవిందం’ అంటున్నారు. మరి పక్కా సమాచారం తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే జెర్సీ, ఆర్ ఎక్స్ 100 సినిమాల రీమేక్ హక్కులని తీసుకున్న సంగతి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: