వరుస విజయాల్లో ఉన్న విజయ్‌ దేవరకొండ - రష్మిక మందాన జంటగా తెర‌కెక్కిన డియ‌ర్ కామ్రేడ్ సినిమా శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. సౌత్‌లో నాలుగు భాష‌ల్లో తెర‌కెక్కిన ఈ సినిమాపై భారీ అంచాన‌లు ఉన్నాయి. ఇక మైత్రీ మూవీస్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కిన ఈ సినిమాతో భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఇక భ‌ర‌త్ టాలీవుడ్ టాప్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌కు శిష్యుడే.


భ‌ర‌త్ త‌న తాజా ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. భ‌ర‌త్‌ది కూడా తూర్పుగోదావ‌రి జిల్లాయే. పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలో జన్మించిన ఆయన కాకినాడ పరిసరాల్లో పెరిగారు. ఇక్కడే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఇంట్లో వాళ్లకి ఉద్యోగం కోసం అమెరికా వెళ్తున్నానని చెప్పి  ఫిల్మ్‌న‌గ‌ర్‌లో సెటిల్ అయిపోయాడు.


12 ఏళ్ల పాటు క‌ష్ట‌ప‌డి చివ‌ర‌కు డియ‌ర్ కామ్రేడ్‌తో ద‌ర్శ‌కుడిగా మారాడు. భ‌ర‌త్ కాకినాడ ఆదిత్య కాలేజీలో చదువుతున్నప్పుడు దర్శకులు సుకుమార్ వాళ్ల‌కు గురువు. భ‌ర‌త్ సుకుమార్ స్టూడెంటే. ఆ త‌ర్వాత భ‌ర‌త్ రాజీవ్‌గాంధీ కళాశాలలో గ్రాడ్యు యేషన్‌ పూర్తి చేశాడు. పెళ్లిచూపులు త‌ర్వాతే ఈ సినిమా రావాల్సి ఉన్నా కాస్త లేట్‌గా ఇప్పుడు రిలీజ్ అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: