తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 రోజు రోజుకీ ఇంటి సభ్యుల మద్య పోటీ పెరుగుతుంది, మనస్పర్థలు వస్తున్నాయి. నాలుగో రోజు  హేమపై శ్రీముఖి, మహేష్‌పై వరుణ్ సందేశ్ ఫైర్ అయ్యారు. ముందుగా చపాతి దగ్గర చిన్నగా గొడవ స్టార్ట్ అయ్యింది. దాంతో హేమపై శ్రీముఖి అలిగింది.అంతే కాదు హేమ - రాహుల్‌ మధ్య నాలుగో రోజు కూడా మాటల యుద్ధం జరిగింది.  లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో హౌస్‌మేట్స్ అందరూ హేమ, జాఫర్‌ ఓటు వేశారు. బడ్జెట్ టాస్క్ ఫెయిల్ అవడంతో హేమ, శ్రీముఖిపై ఫైర్ అయ్యింది.

ఆ తర్వాత శ్రీముఖి పై హేమ కామెంట్ చేయడంతో మరోసారి సీరియస్ అయ్యింది. అలిగి వెళ్లి స్మోకింగ్ జోన్‌లో కూర్చుంది శ్రీముఖి. తర్వాత అందరూ ఆమెని బతిమాలడం, హేమ తన వెర్షన్ చెప్పబోగా శ్రీముఖి అసహనానికి గురవడం జరిగాయి.  మరోవైప వితికా, మహేష్ ల మద్య గొడవ మొదలైంది.  వీరిద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ గొడవకు దిగడంతో తన భార్యపై నోరు ఎత్తుతావా అంటూ వరుణ్ సందేశ్ మద్యలో దూరాడు. దాంతో మహేష్ విట్టా- వరుణ్ సందేశ్ ల మద్య గొడవ తీవ్ర స్థాయిలో పెరిగింది.

ఒకదశలో ఇద్దరం కొట్టుకుందామా అంటూ ముందుకు వచ్చారు.  దాంతో వితికా వెంటనే వరుణ్ సందేశ్ ని పక్కకు తీసుకు వెళ్లింది. ఈ గొడవ ఇలా జరుగుతుండగానే.. నాలుగో రోజు ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇక జూలై 26న టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్ ప్రోమో చూస్తే ఐదో రోజు కూడా హౌస్‌లో రచ్చ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: