గత ఆదివారం ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3 ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులకు సినిమాలు, సీరియల్స్, యుట్యూబ్ ద్వారా పరిచయం ఉన్న సెలబ్రిటీలే ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకుల నుండి ఈ షోపై స్పందన బాగానే వస్తుంది. ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్లో ఆరుగురు సెలబ్రిటీలు ఉన్నారు. వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు, జర్నలిస్ట్ జాఫర్, నటి హిమజ, నటి పునర్నవి భూపాళం, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, నటి హేమ ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు. 
 
ప్రముఖ క్రిటిక్ కత్తి మహేశ్ బిగ్ బాస్ షో గురించి సోషల్ మీడియాలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పాడు. బిగ్ బాస్ సీజన్ 1 లో నోరు జారిన జ్యోతి, సీజన్ 2 లో నోరు జారిన సంజన ఎలిమినేట్ అయ్యారని సీజన్3 లో రాహుల్ సిప్లిగంజ్ నోరు జారాడని అందువలన రాహుల్ ఎలిమినేట్ అవుతాడని అంచనా వేస్తున్నానని కత్తి మహేశ్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. కత్తి మహేశ్ కొన్ని రోజుల క్రిందట బిగ్ బాస్ 3 కు ఎంపికయ్యేవారు వీళ్ళేనంటూ కొంతమంది సెలబ్రిటీల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. 
 
బిగ్ బాస్ సీజన్ 3 కు ఎంపికయిన వారిలో ఒకరిద్దరు తప్ప ఎక్కువగా కత్తి మహేశ్ పోస్ట్ చేసిన సెలబ్రిటీలే ఉండటం విశేషం. అప్పుడు కత్తి మహేశ్ అంచనాలు నిజమయ్యాయి కాబట్టి ఇప్పుడు కూడా కత్తి మహేశ్ అంచనాలు నిజం అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది. కత్తి మహేశ్ సోషల్ మీడియాలో రాహుల్ ఎలిమినేట్ అవుతాడని అభిప్రాయం వ్యక్తపరచడంతో రాహుల్ అభిమానులు మాత్రం తమ వంతుగా ఓటు వేసి గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. మరి కత్తి మహేశ్ చెప్పినట్లు రాహుల్ సిప్లిగంజ్ ఎలిమినేట్ అవుతాడో లేదో తెలియాలంటే ఆదివారం దాకా ఆగాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: