ఏ సినిమాకు అయిన తక్కువ టైం చాలా ఇంపార్టెంట్. సినిమా సోది లేకుండా రెండున్నర గంటలు ఉంటే సరిపోతుంది. రెండున్నర గంటలు మించి సినిమా రన్ టైం ఉంటే థియేటర్లో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వకుండా కూర్చోపెట్టే కంటెంట్ ఉండాలి. రంగస్థలం - బాహుబలి - భరత్ అనే నేను - మహర్షి లాంటి సినిమాలకు మాత్రమే 170 నుంచి 180 నిమిషాల టైం ఉంది. ఈ సినిమాల్లో ఉన్న కంటెంట్ నేపథ్యంలోనే ర‌న్ టైం ఎక్కువ ఉన్నా ఇవి హిట్ అయ్యాయి. మరి ఏకంగా 210 నిమిషాల సినిమా (మూడున్న‌ర గంట‌ల పాటు) ఉంటే ఎలా ఉంటుంది... ఇదే టెన్షన్ సైరా విషయంలో అందరినీ వెంటాడుతోంది.


తాజా సమాచారం ప్రకారం ఎడిటింగ్ టేబుల్ దగ్గర సైరాకు పెద్ద సవాల్ ఎదురవుతోంద‌ట‌. సినిమాను ఎడిటర్, దర్శకుడు కలిపి ఎంత బాగా ట్రిమ్‌ చేసిన ఏకంగా 210 నిమిషాలకు పైగా వస్తుందట. దీంతో ఇప్పుడు  ఏ సీన్ ఉంచాలి... ఏ సీన్ కట్ చేయాలి అన్నది ఎడిటర్, దర్శకుడు సురేందర్ రెడ్డి కి పెద్ద సవాల్గా మారినట్టు తెలుస్తోంది. వాస్తవానికి గతంలో చిరంజీవి కూడా టేబుల్ దగ్గర కూర్చుని బాధ్యత తీసుకున్నారు.


అయితే ఇప్పుడు సైరా విషయంలో మాత్రం ఏ సీన్ ఉంచాలి ?  ఏ సీన్‌ కట్ చేయాలి  అనే విషయంలో చిరు సైతం చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అక్టోబ‌ర్ 2న సైరా వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. ఇక రెండు నెల‌లు మాత్ర‌మే ఉంది.  ఈ లోగా ఎడిటింగ్ కంప్లీట్ చేసుకుని, వీఎఫ్ ఎక్స్ ప‌నులు పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు ఎలా లేద‌న్నా క‌నీసం 30 నిమిషాల ర‌న్ టైం త‌గ్గించాల్సి ఉంటుంది. ప్రేక్ష‌కులు ఎక్క‌డా బోర్ ఫీల‌వ‌కుండా ర‌న్ టైం క‌నీసం మూడు గంట‌ల‌కు తేవాలి. ఇదే ఇప్పుడు సైరా మేక‌ర్స్‌కు స‌వాల్‌గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: