అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మూవీ షూటింగ్ లో ఈమధ్య బన్నీ త్రివిక్రమ్ అసోసియేట్ పై అసహనం వ్యక్తపరిచాడు అని వార్తలు రావడంతో పాటు బన్నీ త్రివిక్రమ్ ల మధ్య ఈమూవీ విషయంలో గ్యాప్ ఏర్పడింది అంటూ వచ్చిన వార్తల పై అల్లు కాంపౌండ్ చాల సీరియస్ దృష్టిని పెట్టినట్లు సమాచారం. అంతేకాదు రానా ఆపరేషన్ విషయాలు బన్నీ సహాయకుల నుండి మీడియాకు లీక్ అయింది అని కూడ సురేష్ బాబు భావిస్తున్నట్లు టాక్. 

దీనితో బన్నీని కార్నర్ చేస్తూ ఇలాంటి నెగిటివ్ వార్తలు పుట్టిస్తున్న ఆ అజ్ఞాతవ్యక్తుల అన్వేషణలో ప్రస్తుతం అల్లు కాంపౌండ్ ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ పిఆర్ వ్యవహారాలను చూసే ఒక టీమ్ నుంచి ఎవరైనా ఇలాంటి లీకులు మీడియాకు లీక్ చేసారా అన్న కోణంలో ఇప్పుడు అన్వేషణ కొనసాగుతున్నట్లు సమాచారం. 

సాధారణంగా టాప్ హీరోల వ్యక్తిగత విషయాలను బయటకు లీక్ చేయడానికి ఆ హీరో దగ్గర పనిచేసే సహాయకులు భయపడతారు. అయితే అల్లు అర్జున్ కు ఇండస్ట్రీలో శతృవులు కూడ ఎవరూ లేని నేపధ్యంలో ఇలా కావాలని బన్నీ చుట్టూ ఇలా నెగిటివ్ వార్తల హంగామా ఎందుకు జరుగుతోంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

వివాదాలకు సంచలనాలకు దూరంగా ఉండే అల్లు అర్జున్ ఇండస్ట్రీలో అజాతశత్రువు. టాప్ హీరోల రేస్ విషయంలో కూడ అతడు హీరోల మధ్య కొనసాగుతున్న పోటీని సీరియస్ గా తీసుకోడు. అందువల్లనే 15 సంవత్సరాల నుండి బన్నీ కెరియర్ ఒకే విధంగా కొనసాగుతోంది. దీనితో అల్లు అర్జున్ చుట్టూ ఉన్న ఎవరో ఒక వ్యక్తి నుండి ఈ నెగిటివ్ వార్తల ప్రహసనం కొనసాగుతోంది అని అల్లు కాంపౌండ్ భావన. దీనితో బన్నీని కార్నర్ చేస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: