టీం ఇండియా స్టార్ బౌలర్  జస్ప్రీత్ బుమ్రా , మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్   ల మధ్య గత కొంత కాలంగా  ప్రేమాయణం నడుస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి.  అయితే ఈ వార్తల ఫై స్పందించి  మా మధ్య లో ఏం లేదని  అసలు బుమ్రా ఎవరో నాకు తెలువదు అని అనుపమ క్లారిటీ ఇచ్చింది అయినా కూడా  ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో  కూడా అనుపమా మరో సారి ఈ వార్తలను కొట్టి పారేసింది.   


 బుమ్రా తో డేటింగ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి అని ఓ విలేకరి  అడిగిన ప్రశ్నకు..  అనుపమ  నో కామెంట్స్ దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు. బుమ్రా గురించి నన్ను అడగకండి  అని   సమాధానం ఇచ్చింది.   కాగా  ప్రస్తుతం ఆమె  'రాక్షసుడు' అనే సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా వుంది.  సూపర్ హిట్ కోలీవుడ్ మూవీ  'రాక్షసన్' కు రీమేక్ గా తెరకెక్కుతుంది ఈచిత్రం. 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో  అనుపమ ఒరిజినల్ వెర్షన్ లో  అమలా పాల్ పోషించిన పాత్రలో  నటిస్తుంది.  ఆగస్టు 2 న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ఈ సినిమాతో పాటు అనుపమ  మరో రీమేక్ కు సైన్ చేసింది.  తెలుగు సూపర్ హిట్ మూవీ  'నిన్ను కోరి' ని  ఇప్పుడు తమిళం లో రీమేక్ చేస్తున్నారు. ఇందులో అనుపమ హీరోయిన్ గా నటిస్తుంది


మరింత సమాచారం తెలుసుకోండి: