బాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్స్ కు 30  40 వయసుకు చేరువులో ఉన్న అందాలతో ప్రదర్శనలో మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. గతంలో హీరోయిన్ల వయసు ముప్పై టచ్ చేస్తేనే 'ఆంటీ' అనే ముద్ర పడిపోయేది. కానీ ఇప్పుడు ఈ ముప్పైల.. నలభైల భామలు కఠినమైన కసరత్తులు చేస్తూ.. స్ట్రిక్టు డైట్ ఫాలో అవుతూ ఖజురహో శిల్పాలలాగా తమ శరీరాలను కాపాడుకుంటున్నారు. 


అలా తీరైన ఒంపుసొంపులతో శరీరాలను మెయింటెయిన్ చేస్తూ ఘాటు ఫోటో షూట్లలో ఎడాపెడా పాల్గొంటున్నారు.  వీరి ఫోటోలకు లక్షల్లో లైకులు.. వేలల్లో కామెంట్లు వస్తుండడంతో మరింతగా రెచ్చిపోయి.. రెట్టించిన ఉత్సాహంతో ఫోటోషూట్ల హాటు ఉద్యమాలను నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు.సోషల్ మీడియానే లేకపోతే ఈ వయసు మళ్ళిన భామలను ఎవరూ పట్టించుకోరేమో.


కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఈ బ్యూటీలు అందాలకు కొత్త అర్థం చెప్తున్నారు.  మలైకా అరోరా.. మందిరా బేడి.. శిల్పా శెట్టి.. అమీషా పటేల్.. బిపాషా బసు.. పూజా బాత్రా లాంటి నలభైల భామలు.. రాయ్ లక్ష్మి..  శ్రియ.. నేహా శర్మ.. షమ సికందర్.. లాంటి ముప్పైల భామలు ఈ లిస్టులో ఉన్నారు. ఈ పేర్లు రాసుకుంటూ పోతే లిస్టు ఇంకా పెద్దదవుతుంది.  నిజానికి సోషల్ మీడియాలో ఈ భామలను విమర్శించే వారు కూడా ఉన్నారు కానీ ఈ బ్యూటీల అందాల విందు ఎప్పుడెప్పుడు చేస్తారా అంటూ కాచుక్కూచునే చకోరపక్షులకు కొదవేమీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: