నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ముందుగా అనుకున్న ప్రకారం ఆగష్ట్ 30వ తేదీన విడుదల కావాలి. గ్యాంగ్ లీడర్ సినిమా ఆగష్ట్ 30 వ తేదీన విడుదల చేస్తున్నామని అఫీషియల్ గా కూడా ప్రకటించింది గ్యాంగ్ లీడర్ సినిమా యూనిట్. కానీ సాహో సినిమా రిలీజ్ డేట్ ఆగస్ట్ 15 నుండి ఆగస్ట్ 30కు మార్చుకోవడంతో గ్యాంగ్ లీడర్ సినిమాకు సమస్య మొదలైంది. సాహో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ సినిమాకు పోటీగా గ్యాంగ్ లీడర్ రిలీజ్ చేస్తే నష్టపోయేది మాత్రం గ్యాంగ్ లీడర్ సినిమానే. 
 
సాహో సినిమా విడుదలైన రెండు వారాల తరువాత గ్యాంగ్ లీడర్ విడుదల చేద్దామని భావించినా వాల్మీకి సినిమా ఆ తేదీకి ఫిక్స్ అవ్వటంతో గ్యాంగ్ లీడర్ సినిమాకు సరైన రిలీజ్ డేట్ దొరకటం కష్టమయింది. సెప్టెంబర్ 20 లేదా 27వ తేదీన గ్యాంగ్ లీడర్ సినిమా విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నా సైరా నరసింహా రెడ్డి సినిమా విడుదలైతే గ్యాంగ్ లీడర్ థియేటర్లన్నీ సైరా నరసింహారెడ్డికి కేటాయించే అవకాశం ఉంది. ఈ కారణాల వలనే గ్యాంగ్ లీడర్ సినిమా యూనిట్ కొత్త తేదీని ఇంకా ప్రకటించలేదు. తన సినిమాకు రిలీజ్ డేట్ సమస్యలు రావటం పట్ల నాని కూడా బాగా ఫీలవున్నాడట.  
 
ఇప్పటికే విడుదలైన గ్యాంగ్ లీడర్ టీజర్ కు మంచి స్పందన వస్తుంది. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా పోలికలు కనిపిస్తున్నప్పటికీ ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు మాత్రం లోటు ఉండదని సమాచారం. హలో సినిమా ఫ్లాప్ కావటంతో ఎలాగైనా హిట్ కొట్టాలని విక్రమ్ కుమార్ జాగ్రత్తగా గ్యాంగ్ లీడర్ సినిమాను తెరకెక్కించాడని తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: