భారత దేశంలో కొంత కాలంగా బాలీవుడ్ లో ఎంతో పాపులారిటీ సంపాదించిన బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్.  బాలీవుడ్ లో బిగ్ బాస్ కి సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  బిగ్ బాస్ ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మళియాళ, మరాట భాషల్లో కూడా వస్తుంది.  తెలుగు లో ఇప్పటి వరకు రెండు సీజన్లు ముగిశాయి. ప్రస్తుతం మూడో సీజన్ ప్రసారం అవుతుంది.  బిగ్ బాస్ 3 కి అక్కినేని నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  అయితే ఈ మద్య బిగ్ బాస్ 3 పై యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రీ గుప్త తమను బిగ్ బాస్ యాజమాన్యం లైంగికంగా వేధించారని పోలీస్ కేసు పెట్టిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో నింధితులుగా భావిస్తున్న నలుగురు ముందస్తు బెయిల్ సంపాదించారు. అయితే మరి బిగ్ బాస్ లోకి పోలీస్ లు ఎలా ప్రవేశించారన్న అనుమానం వస్తుంది కదా..అయితే ఇది తెలుగు బిగ్ బాస్ లోకి కాదు.  తమిళ బిగ్ బాస్ హౌజ్ లో జరిగింది. నటి మీరా మిథున్ ని ప్రశ్నించడానికి తమిళ బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టారు చెన్నై పోలీసులు. నటి మీరా మిథున్ ఓ పూల వ్యాపారి దగ్గర 50 వేలు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు అందడంతో మీరా మిథున్ పై కేసు నమోదు అయ్యింది .

ఆ కేసులో ముందస్తు బెయిల్ కూడా తీసుకుంది మీరా మిథున్ కానీ కేసు విచారణలో భాగంగా మీరా మిథున్ ని అరెస్ట్ చేస్తారా ? లేక ప్రశ్నించి వదిలేస్తారా ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బిగ్ బాస్ లోకి హాయిగా ఎంటర్ అయ్యింది మీరా మిథున్ కానీ పోలీసులు హౌజ్ లోకి రావడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: