నటసింహం బాలకృష్ణ సినిమా ఎప్పుడొస్తుందా అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి ఎన్టీఆర్ గా వచ్చిన బాలయ్య ఇప్పటివరకూ మరో సినిమా పట్టాలెక్కించలేదు. బోయపాటి దర్శకత్వంలో సినిమా అని వార్తలు వచ్చినా అనూహ్యంగా తమిళ డైరక్టర్ కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో సినిమా ఎనౌన్స్ చేశాడు.


ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ గా ఎస్పీ రంజిత్ కుమార్ అని, రూలర్ అని ప్రచారంలోకి వచ్చాయి. మేకర్స్ రూలర్ ఫిక్స్ చేశారంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తెరమీదకి కొత్త టైటిల్ వచ్చింది. “రాయలసీమ” అనే టైటిల్ ను బాలయ్య కోసం పరిశీలిస్తున్నారని టాక్. క్యారక్టర్ పవర్ ఫుల్ గా ఉండటంతో టైటిల్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉండాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఫ్యాన్స్ కు ఈ టైటిల్ నచ్చిందని టాక్. మరి ఈ టైటిల్ ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది.


 గత ఏడాది బాలయ్య-రవికుమార్ కాంబినేషన్ లో జైసింహ అనే సినిమా వచ్చింది. సోనాల్ చౌహాన్, వేదిక బాలయ్య పక్కన ఆడిపాడనున్నారు. దర్శకుడు పరుచూరి మురళి కథను అందస్తూండగా, రత్నం మాటలు రాస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: