సమంత లీడ్ రోల్ లో నందిని రెడ్డి దర్శకత్వంలో " ఓ బేబి" అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. కొరియన్ మూవీ" మిస్ గ్రానీ" కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది.  ఇందులో సమంత నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.ఈ సినిమా విజయంతో ఆనందంలో ఉన్న నందినీ రెడ్డికి మంగళవారం డిల్లీ హైకోర్టు పెద్ద షాకిచ్చింది.


 2013 లో నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత, సిద్ధార్థ్ హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రం "జబర్దస్త్". ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది.  వాస్తవానికి ఈ మూవీ రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ జోడీగా 2010లో విడుదలైన “బ్యాండ్ బాజా బరాత్” ని కాపీ కొట్టారనే వివాదం చోటు చేసుకుంది. అంతే కాదు ఈ మూవీని తెలుగులో “జబర్దస్త్” గా అనధికారికంగా కాపీ చేసారని యష్ రాజ్ ఫిలిమ్స్ అప్పట్లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ మన్మోహన్ ఆధ్వర్యంలోని ఢిల్లో కోర్టు  యష్ రాజ్ ఫిలిమ్స్కి  అనుకూలంగా తెలుగు చిత్రం “జబర్దస్త్”ని ఏవిధంగా ప్రదర్శించరాదని తీర్పు వెలువరించింది.


 అంతే కాదు “జబర్దస్త్” మూవీ ప్రదర్శన ఆపివేయాలని హై కోర్ట్ ఆదేశించడం జరిగింది. ఈ మూవీకి సంబందించిన సీడీలు, బ్లూ రే ప్రింట్ల ప్రదర్శనతో పాటు, ఏవిధమైన ప్రదర్శన చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో “జబర్దస్త్” మూవీ పరాజయాన్ని చవిచూసింది.  ఐతే మళ్ళీ ఆరేళ్ళ తరువాత కలిసి పనిచేసిన సమంత, నందినిరెడ్డి “ఓ బేబీ” చిత్రం తో సూపర్ హిట్ అందుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: