అమ్మ అంటే గుర్తుకు వచ్చేది జయలిత.  జయలిత మరణం తరువాత తమిళనాడు రాష్ట్రం దిక్కులేనిది అయ్యింది.  అక్కడ రాజకీయాల్లో అనిశ్చితి నెలకొంది.  అటు డీఎంకే అధినేత కరుణానిధి కూడా మరణించడంతో తమిళనాడులో ఓ శకం అంతరించిపోయింది.  


అమ్మ జీవితం ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి.  ఇప్పటికే కొంతమంది దర్శకులు ఆమె జీవితం ఆధారంగా సినిమాలు చేయబోతున్నారు.  అందులో ఏ ఎల్ విజయ్ ఒకరు.  అయన ఇప్పటికే కథను సిద్ధం చేశారు.  ఇందులో జయలలిత పాత్రలో కంగనా నటిస్తోంది.  


కంగనా యాటిట్యూడ్ కు అమ్మ యాటిట్యూడ్ కు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి.  అందుకే ఆమెను ఎంచుకున్నారు.  ఈ సినిమా కోసం కంగనా తమిళం కూడా నేర్చుకుంటోంది.  త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నది.  ఆమె నటించిన జడ్జిమెంటల్ క్యా హై సినిమా సూపర్ హిట్ కావడంతో మరలా లైన్లోకి వచ్చింది.  


అమ్మ బయోపిక్ కోసం హాలీవుడ్ నుంచి టెక్నిషియన్స్ వచ్చి పనిచేస్తున్నారు.  కంగనాను అమ్మలా చూపించేందుకు ప్రముఖ మేకప్ ఆర్టిస్టులు వస్తున్నారట. దీంతో పాటు మరికొంతమంది హాలీవుడ్ టెక్నిషియన్స్ కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారని తెలుస్తోంది.  మొత్తానికి అమ్మ బయోపిక్ ను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించబోతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: