సోషల్ మీడియాలో హృదయ కాలేయం సినిమా తో పాపులర్ అయిన సంపూర్ణేష్ బాబు ఆ తరువాత సినిమా ఇండస్ట్రీలో సింగం 123 అలాగే వివిధ సినిమాలు మరియు కామెడీ పాత్రలు చేసిన ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో సంపూర్ణేష్ బాబు కి వచ్చిన అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. గత కొన్నాళ్ల నుండి సంపూర్ణేష్ బాబు ఎక్కడ కూడా వెండితెరపై కనబడలేదు.


ఇటువంటి క్రమంలో సంపూర్ణేష్ బాబు మంచి ఫాంలో ఉన్న సమయంలో అప్పట్లోనే కొబ్బరిమట్ట అనే సినిమా ఒప్పుకోవడం జరిగింది. అప్పట్లో ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో పెద్ద హడావిడి కూడా జరిగింది. తర్వాత సినిమా గురించి పెద్దగా ఎక్కడా కూడా టాక్ రాలేదు. దీంతో చాలామంది తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాను మర్చిపోయారు. మధ్య మధ్యలో పోస్టర్లు విడుదల చేసిన పెద్దగా గుర్తింపు పొందలేదు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఆగస్టు 10 అని అందరికీ షాక్ ఇచ్చారు. మరోపక్క అదేరోజు కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు 2, కథనం రిలీజ్ లు ఉన్నాయి.


అలాగే ఈ సినిమా వారం పూర్తయ్యి మళ్లీ శుక్రవారం వచ్చేసరికి అడవి శేషు ఎవరు, శర్వానంద్ రంగస్దలం చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిన్నిటి మధ్యనా ఈ సినిమా రిలీజ్ చేస్తూండటంతో సంపూ అభిమానులు కంగారుపడుతున్నారు. మంచి కంటెంట్, నవ్వుకునే సినిమా అయినా వీటి మధ్యన నలిగిపోతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఎంతమంది ఇండస్ట్రీలో ఎన్ని మాటలు చెప్పినా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఈ సినిమా అదే తేదీన విడుదలవుతుందని నిర్ణయం మారే ప్రసక్తి లేదని చెబుతున్నట్లు ఫిలిం నగర్ టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: