ప్రస్తుతం ఓవైపు మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక మరోవైపు యువరత్న బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమా పూజా  కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. అతిత్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. 

ఇకపోతే బాలకృష్ణ, కొద్దిరోజుల క్రితం బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారనే వార్త ప్రచారం అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా కథ బాలకృష్ణకు నచ్చినప్పటికీ, కొన్ని సన్నివేశాల విషయమై కొంత మార్పులు చేర్పులు చేసుకుని రమ్మని బోయపాటికి చెప్పారట బాలకృష్ణ. ఇక ప్రస్తుతం ఆ సినిమా తాలూకు కథ మార్పులు, చేర్పులు మొత్తం పూర్తి అయ్యాయని, మరొక మూడు నెలల్లో ఆ సినిమాను అధికారికంగా ప్రారంభించి షూటింగ్ కూడా మొదలెట్టనున్నారని టాక్. అంతేకాక సినిమాను ఎట్టిపరిస్థితుల్లో వచ్చే వేసవి కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట బోయపాటి. ఇక మెగాస్టార్ కూడా సైరా తరువాత త్వరలో ప్రారంభం కాబోయే కొరటాల సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. త్వరలో అధికారికంగా ప్రారంభమయ్యే ఈ సినిమా, సెప్టెంబర్ చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందట. 

అయితే ఈ సినిమాను కూడా ఎట్టిపరిస్థితుల్లో రాబోయే వేసవిలోనే తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట కొరటాల. మరి ఈ విధంగా చూస్తే అటు మెగాస్టార్, ఇటు యువరత్న సినిమాలు ఒకేసారి రాబోయే వేసవి బరిలో తలపడనున్నట్లు కొంత అర్ధం అవుతుంది. అయితే ఈ రెండు సినిమాల విడుదల విషయమై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, అందుతున్న సమాచారం ప్రకారం ,వారిద్దరి సినిమాలు వేసవిబరిలో తలపడే అవకాశం లేకపోలేదని అంటున్నారు సినీ విశ్లేషకులు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: