సినీ పరిశ్రమలో పెద్ద సినిమాలు వస్తే చిన్న సినిమాలు రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ చేసుకోవడం జరుగుతుంది.  ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ ప్రకటించినా దాని నష్టాలు ఎక్కువ ఉంటాయనే ఉద్దేశ్యంతో రిలీజ్ డేట్ తర్వాత రోజుకి వాయిదా వేస్తుంటారు.  అలాంటిది 'హృదయ కాలేయం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన సంపూర్ణేష్ బాబు తాజాగా త్రిపాత్రాభినయంలో స్టీవెన్‌ శంకర్‌ అందించిన కథ, కథనం, మాటలతో 'కొబ్బరిమట్ట' చిత్రం రూపొందుతోంది.

ఈ మూవీకి పక్‌ రొనాల్డ్‌సన్‌ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సాయి రాజేష్‌ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా మొదలు పెట్టి మూడు సంవత్సరాలు అవుతున్నా ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్ చేంజ్ కావడమో ఏదో ఒక ఉపద్రవం ముంచుకు రావడమో జరుగుతుంది.  దాంతో అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా? లేదా అనుమానాలు కూడా కలిగాయి. అంతే కాదు ఈ మూవీకి సంబందించిన లిరికల్ సాంగ్స్ ఎప్పుడో రిలీజ్ అయ్యాయి.  అప్పడప్పుడు కొత్త పోస్టర్లు కూడా రిలీజ్ చేస్తున్నారు. అయినా కూడా ఈ మూవీ రిలీజ్ అవుతందా అనుమానం ప్రేక్షకులకు కలిగింది. 

వీటన్నింటికీ చెక్ పెడుతూ..ఆగష్టు 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.  ఈ మూవీలో  పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడు లాంటి పాత్రలు చేసి మెప్పించబోతున్నారు. ఈ సినిమాకు సంబందించి ఇటీవల విడుదల చేసిన 'అఆ.. ఇఈ' అనే సాంగ్‌ యూట్యూబ్‌లో రెండు మిలియన్స్‌ వ్యూస్‌ 24 గంటల్లో రావటం ఈ మూవీ పై సినిమా లవర్స్‌కి ఉన్న క్రేజ్‌ని తెలియజేస్తుంది.  120 నిమిషాల ఈ మూవీలో యాక్షన్‌, కామెడి, సెంటిమెంట్‌, రొమాన్స్‌, సందేశం, ఎమెషన్‌, లవ్‌ అంశాలున్నాయి.  ఈ మూవీ సక్సెస్ ఫుల్ అయితే మాత్రం సంపూ మరోసారి రెచ్చిపోవడం ఖాయం అంటున్నారు అభిమానులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: