అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు నటుడు బెల్లంకొండ శ్రీనివాస్. తొలి సినిమాకే దాదాపు 40 కోట్ల భారీ బడ్జెట్తో వినాయక్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి సినిమాకు హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లు రాకపోవటంతో అల్లుడు శ్రీను సినిమా ఫ్లాప్ అయింది. అల్లుడు శ్రీను తరువాత లో బడ్జెట్లో స్పీడున్నోడు సినిమాలో నటించినా ఆ సినిమా కూడా డిజాస్టర్ అయింది.వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ భారీ బడ్జెట్తో బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాలో నటించాడు బెల్లంకొండ శ్రీనివాస్. కానీ స్టార్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీను కూడా బెల్లంకొండ శ్రీనివాస్ కు హిట్ ఇవ్వలేకపోయాడు. 
 
వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం, శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో కవచం, తేజ దర్శకత్వంలో సీత సినిమాలో నటించాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమాలేవీ బెల్లంకొండ శ్రీనివాస్ కు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. వరుసగా సినిమాలు ఫ్లాప్ కావటంతో బెల్లంకొండ శ్రీనివాస్ మార్కెట్ కూడా సినిమా సినిమాకు తగ్గుతోంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగష్ట్ 2 వ తేదీన విడుదల కాబోతుంది. 


ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్లో బెల్లంకొండ శ్రీనివాస్ నటన కూడా బాగుందని ప్రశంసలొస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. రైడ్ ఫేమ్ రమేశ్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మరి బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతోనైనా హిట్టు కొడతాడో లేదో చూడాలి. ఈ సినిమా తమిళ్ రాట్చసన్ సినిమాకు రీమేక్. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: