విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన గీతా గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ కావటంతో అదే జోడీ జంటగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.కానీ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. ఏ సెంటర్లలో డియర్ కామ్రేడ్ సినిమాకు హిట్ టాక్ వినిపిస్తుంటే, బీ సీ సెంటర్లలో మాత్రం సినిమా యావరేజ్ అనే టాక్ వినిపిస్తుంది. టాక్ ఇలా ఉన్నప్పటికీ కలెక్షన్లలో మాత్రం డియర్ కామ్రేడ్ సినిమా రికార్దు స్థాయి వసూళ్ళు అందుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో డియర్ కామ్రేడ్ ఏడున్నర కోట్ల వసూళ్ళు సాధించగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 11 కోట్ల రుపాయల కలెక్షన్లు వచ్చాయి. 
 
కానీ ఈ సినిమాకు పైరసీ రూపంలో భారీ షాక్ తగిలింది. కొన్ని పైరేటెడ్ వెబ్ సైట్లు నిన్న రాత్రే డియర్ కామ్రేడ్ మొత్తం సినిమాను ఆన్ లైన్లో అప్ లోడ్ చేసాయి. డియర్ కామ్రేడ్ సినిమా పైరసీ కావటం వలన పైరసీ ప్రభావం కలెక్షన్ల మీద పడే అవకాశం ఉండొచ్చని తెలుస్తుంది. డియర్ కామ్రేడ్ సినిమా యూనిట్ పైరసీ చేసిన వెబ్ సైట్లపై చర్యలు తీసుకుంటే మంచిది. మరో వైపు కన్నడిగులు కర్ణాటక రాష్ట్రంలో కన్నడ సినిమాలకంటే తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని డియర్ కామ్రేడ్ సినిమాపై సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేసారు. 
 
వీకెండ్ వరకు డియర్ కామ్రేడ్ సినిమాకు ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ సోమవారం నుండి ఈ సినిమా కలెక్షన్లు ఎలా సాధిస్తుందో అనే దాని పైనే ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ ఆధారపడి ఉండే అవకాశం ఉంది. సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు రీజనబుల్ రేట్లకే విక్రయించడంతో సినిమా బ్రేక్ ఇవెన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఫుల్ రన్లో మాత్రం ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి. విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. టైటిల్ ఇంకా ఫిక్స్ కాని ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్ నటించబోతున్నారు. ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె ఎస్ రామారావ్ నిర్మిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: