బిగ్ బాస్ సీజన్ 3లో మొదటి వారమే కంటెస్టంట్స్ మధ్య గొడవలు షోకి మంచి స్టఫ్ ఇస్తున్నా వారంలోనే ఇన్ని గొడవలు జరిగాయంటే ఇక 100 రోజుల్లో ఏం జరుగుతాయో అనుకుంటున్నారు ఆడియెన్స్. జూలై 21 ఆదివారం మొదలైన బిగ్ బాస్ సీజన్ 3 వారం రోజులు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ లో వారం గడిచింది అంటే ఒక కంటెస్టంట్ కు బై బై చెప్పాల్సిన టైం వచ్చినట్టే.  


ఈవారం ఆరుగురు ఇంటి సభ్యులు నామినేషన్ లో ఉన్నారు. హిమజ, రాహుల్, జాఫర్, హేమ, పునర్నవి, వితిక ఈ వారం నామినేషన్ లో ఉన్న ఆరుగురు కంటెస్టంట్స్. అయితే ఇందులో ఈరోజు నాగార్జున వచ్చి ముగ్గురిని సేఫ్ జోన్ లోకి పంపిచేస్తాడు. మిగతా ముగ్గురిలో రేపు అంటే ఆదివారం ఒకర్ని ఎలిమినేట్ చేస్తారు.    


ఇంతకీ ఈ వారం ఆరుగురిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటే అందరు టివి 9 జాఫర్ పేరు చెబుతున్నారు. ఈ ఆరుగురిలో హిమజకు ఎక్కువ ఓట్లు వచ్చాయట. ఆ తర్వాత రాహుల్, హేమ ఉన్నారట. పునర్నవికి బాగానే ఓట్లు పడ్డాయని తెలుస్తుంది. ఇక మిగిలిన వితిక, జాఫర్ లు మాత్రమే. వరుణ్, వితిక ఇద్దరు హాట్ పెయిర్ కొన్నాళ్లు షోని నడిపించాల్సి ఉంది కాబట్టి ఈవారం జాఫర్ నే ఎలిమినేట్ చేస్తారని కొందరు అంటున్నారు.   


అయితే మరికొందరు మాత్రం హేమని ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆమె ఇంటి సభ్యులతో మాట్లాడే విధానం తప్పుగా ఉందని తనకు అన్ని తెలుసన్న పొగరుతో ఆమె ప్రవర్తిస్తుందని కొందరి అభిప్రాయం. మరి ఎవరికి ఎన్ని ఓట్లొచ్చాయో ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఈరోజు 9 గంటలకు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 1లో మొదటివారం జ్యోతి ఎలిమినేట్ అవగా.. సెకండ్ సీజన్ లో సంజన ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యింది. మరి ఈ సీజన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.  




మరింత సమాచారం తెలుసుకోండి: