సినిమా రంగంలోకి వచ్చేవారికి ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. బ్యాక్ రౌండ్ తో నెట్టుకురావాలనుకున్నా వర్కౌట్ కాదు. నిర్మాత, దర్శకుల కొడుకులు హీరోలు కావాలనుకున్నా కొంతమంది కాలేరు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి కూడా హీరోగా నీతో, మార్నింగ్ రాగా వంటి సినిమాల్లో ట్రైచేసాడు. కానీ సక్సెస్ కాలేదు. దీంతో తనకి ఇష్టమైన దర్శకత్వంపై వెస్ట్ హాలీవుడ్‌లోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో కోర్సు చేసి అటువైపు అడుగులేశాడు.

 

అలా ప్రకాశ్ తెలుగులో బొమ్మలాట, అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరో లాంటి సినిమాలకు దర్శకత్వం చేశాడు. కానీ ఏ ఒక్కటీ హిట్ కాలేదు. 2004లో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టి ఇప్పటికి మూడు సినిమాలు తీసినా రాని హిట్ ఇన్నేళ్ల తరువాత 2019లో తీసిన నాలుగో సినిమాతో దక్కింది. మొత్తానికి తాను సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిపించుకున్నాడు. హిందీలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” జడ్జిమెంటల్ హై క్యా ” చిత్రం నిన్న విడుదలై హిట్ టాక్ వచ్చింది. కంగనా నటనకు, ప్రకాష్ కోవెల మూడి దర్శకత్వ ప్రతిభకు ప్రశంసలు దక్కుతున్నాయి. రేటింగ్స్, మౌత్ టాక్ కూడా ఫేవర్ గా ఉన్నాయి.

 

బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఏక్తాకపూర్ నిర్మించిన ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు, జిమ్మీ షెర్గిల్, అమ్రీ దస్తూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగులో దర్శకత్వం కలిసిరాని ప్రకాశ్ తన లక్ ఎలా ఉందో టెస్ట్ చేసుకోవడానికి బాలీవుడ్ వెళ్ళాడు లక్కీ గా జడ్జిమెంటల్ హై క్యా తో హిట్ కొట్టాడు . దీంతో రాఘవేంద్రరావు కు నిజమైన పుత్రోత్సాహం లభించడంతోపాటు తన దర్శకత్వ వారసత్వాన్ని నిలబెట్టినట్టైంది. టాలీవుడ్ లో కూడా హిట్ కొడితే ప్రకాశ్ డ్రీమ్ నెరవేరినట్టే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: