మన స్టార్స్ ఇటు సినీ పరిశ్రమలోనే కాక వ్యాపార రంగంలోను కూడా చాలా బిజీ బిజీ   గా అణువుగా రాణిస్తున్నారు. టాలివుడ్ లో ఇప్పటికే యువ కథానాయకుడైన విజయ్ దేవర కొండ "రౌడీ" పేరుతో ఒక సొంత దుస్తుల బ్రాండ్ ను ప్రారంభించారు . అలానే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా ఈ మద్య కాలంలో గచ్చిబౌలిలో ఒక విలాసవంతమైన ఏఎంబీ సినిమాస్ అనే పేరుతో ఒక మల్టీ ప్లెక్స్ ను ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే .


ఇదిలా ఉండగా ఆయన త్వరలో సొంతంగా ఒక దుస్తుల బ్రాండ్ ను ప్రారంభించబోతున్నారనే పలు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మేము ప్రజలలో ఎంతో రెట్టింపు ఉత్సాహాన్ని పెంచబోతున్నామని, మేము దీని పనిలోనే ఉన్నామని మహేష్ బృందం పోస్ట్ చేశారు. ఈ పోస్టులో ఒక లింకును కూడా వారు పెట్టారు. సీక్రెట్ ను బయటపెట్టేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి అంటూ https://www.spoyl.in/mahesh-babu అనే వెబ్ సైట్ ని పోస్ట్ చేశారు.దీనినే మహేష్ బాబు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.


ఈ వెబ్ సైట్ లో మూడు రోజులు కౌంట్ డౌన్ ఉన్నట్లు దీని కింద వారంలో దుస్తుల రకాలు బ్రాండ్ లు ఉంచారనీ, మరో మూడు రోజుల్లో ఈ ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ప్రారంభమౌతోందని తెలిపారు. మన టాలివుడ్ లోనే కాక బాలీవుడ్ లో కూడా కొంత మంది ప్రముఖు హృతిక్‌ రోషన్‌, సోనమ్‌ కపూర్‌, అనుష్క శర్మ, దీపికా పదుకొణె, సన్నీ లియోని తదితరులు సొంతంగా దుస్తులు, యాక్సెసెరీస్ బ్రాండ్లను నడుపుతున్నారని మనకు తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: