టాలీవుడ్, కోలీవుడ్ లో నిన్నటి తరం హీరోయిన్లు జ్యోతిక, రేవతి ఒక వెలుగు వెలిగారు. జ్యోతిక తమిళ స్టార్ హీరో సూర్య సతీమని. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మెగాస్టార్ సరసన ఠాగూర్, అలానే రవితేజ సరసన షాక్ సినిమాల్లో నటించిన జ్యోతిక, తన ఆకట్టుకునే నటనతో ఇక్కడ కూడా మంచి పేరు సంపాదించారు. సూర్య ని వివాహం చేసుకున్నాక దాదాపుగా సినిమాలకి దూరం అయిన జ్యోతిక 36 వాయుథినిలే సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీలోను విభిన్నమైన పాత్రలకి మాత్రమే ఓకే చెబుతూ, ముందుకు వెళుతున్నారు.

జ్యోతిక ఇటీవల తమిళనాట నాచియార్, రాక్షసి వంటి విభిన్న తరహా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా ఈ ఇద్దరూ ప్రధానమైన పాత్రధారులుగా తమిళంలో 'జాక్ పాట్' చేశారు.  తమిళంతో పాటు తెలుగులోను అదే టైటిల్ తో వచ్చేనెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.  ఇటీవల ఈ మూవీ తమిళ వెర్షన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. 

ట్రైలర్ లో రేవతి కామెడీతో అదరగొడితే..జ్యోతిక మాత్రం యాక్షన్ తో దుమ్మురేపింది. వాళ్లు ఇచ్చే బిల్డప్స్ ను బట్టి, ఇది పూర్తిగా వినోదభరితమైన సినిమా అని తెలుస్తోంది. సూర్య తన సొంత బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి, కల్యాణ్ దర్శకుడిగా వ్యవహరించాడు. తెలుగులో ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.  విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఆడియో, ట్రైలర్ ని రేపు విడుదల చేయనున్నారు. యోగి బాబు, ఆనంద్ రాజ్, మొట్ట రాజేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక కోలీవుడ్ లో సూర్య ఆయన తమ్ముడు కార్తీ ఇద్దరూ యాక్షన్ మూవీస్ లోనే ఎక్కువగా నటిస్తున్న విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: